Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.08.2022
Share:

By Village Missionary Movement

Friday, 05-Aug-2022

దిన ధ్యానము(Telugu) 06.08.2022

 

అంశం:- ఒకే మార్గం.

 

"గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు" - సామెతలు 16:5

 

పరిశుద్ధ గ్రంధంలో ఎస్తేరు పుస్తకంలో హామాను అనే వ్యక్తిని గూర్చి మనం చదువుతున్నాం. అతని జీవితంలో జరిగిన ఒక సంఘటనను వెనక్కి తిరిగి చూద్దాం. హిందు దేశం మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు అనే రాజు ఏలుతూ ఉన్నాడు. ఆ రాజు తన యొద్ద ఉన్న అధిపతులందరి కంటే హామాను పీఠమును ఎత్తుగా ఉంచాడు. రాజ భవనంలో ఉన్న అందరూ అతనిని నమస్కరించేవారు. రాణి అయిన ఎస్తేరు యొక్క బంధువు అయిన మొర్దేకై రాజా గుమ్మములో కూర్చొని ఉండెను. అతడు యూదుడు కావడంతో హామానుకు వంగకయు నమస్కారం చేయకయు యుండెను. అందువలన కోపోద్రేకుడైన హామాను అతని పైన కోపగించి అదేశంలో ఉన్న యూదులు అందరిని చంపాలి అని పధకం వేసాడు. ఒక రోజు ఎస్తేరు రాణి సిద్ధపరచిన విందుకు రాజు మరియు హామాను పిలువ బడ్డారు. విందు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్న హామాను అతనికి నమస్కారం చెయ్యని మొర్దేకై ను చూసి మిక్కిలి కోపగించి తన భార్య మరియు స్నేహితుల సలహా మేరకు మొర్దేకై ను ఉరి తీయుటకు ఉరి కొయ్యను ఒకటి ఏర్పాటు చేసి తానే ఆ ఉరి కొయ్యపైన ఉరి తియ్యబడి మరణించాడు. హామాను తన జీవితంలో చాలా మేలులు పొందుకొన్నాడు. రాజ భవనంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికి ఒక చిన్న విషయంలో మూర్కముగా ప్రవర్తించడం వలన తన జీవితమునే కోల్పోయాడు. మనము కూడా హామాను వలె ప్రతి ఒక్కరు నన్ను గౌరవించాలి మర్యాదను ఇవ్వాలి అని లోలోపల ఆశిస్తూ ఉంటాం కదా! అలా మనలను గౌరవించని వారికి చాలా అడ్డంకులను కలిగించి వారికి రావాల్సిన మేలులను అడ్డుకొంటున్నామా? నేను ఎవరు? నేను ఎంత గొప్ప పదవిలో ఉన్నాను? ఎంత చదువుకొన్నాను? నా దగ్గర ఎంత సంపద ఉంది అని మిమ్మును మీరే గర్వించు కొంటు ఇతరులు నన్ను గౌరవించాలి అని ఆశించడం అనేది పాప స్వభావమునకు సూచన. 

 

ప్రియమైన వారలారా! మనం జీవిస్తున్న సమాజంలో ఇతరుల ఔన్నత్యాన్ని తట్టుకోలేని దృక్పధం, అసూయ, ఇతరులను నాశనం చెయ్యాలి అనే దుష్ట ఉద్దేశ్యం గౌరవం కోసం చేసే పనులు సమాజాన్ని నాశనం చేస్తాయి. సమాజాన్ని సంస్కరించడానికి ఏకైక మార్గం అలాంటి ఆలోచనల నుండి వ్యక్తి యొక్క మనస్సును మార్చడమే. దేవుడు మాత్రమే ఒక వ్యక్తిని పాపము నుండి మార్చగలరు. కాబట్టి ఈ సమాజం దేవుని వైపే చూసేలా ప్రార్దిద్దాం. 

- శ్రీమతి. జమిలా ప్రతిబన్ గారు 

 

ప్రార్థన అంశం:-

తమిళనాడులో ప్రతి శనివారం జరుగుతున్న ఉజ్జీవ కూటములలో అనేకులు పాల్గొనేలా మరియు ఉజ్జీవం కలుగు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet