Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.08.2022
Share:

By Village Missionary Movement

Thursday, 04-Aug-2022

దిన ధ్యానము(Telugu) 05.08.2022

 

అంశం:- అంగీకరించు.

 

"అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను” - రోమీయులకు 5:8

 

నేడు మన సమాజం అనేక క్షీణతల మధ్యలో ఉంది. అందులో ఒకటి వ్యభిచారం. వ్యభిచారం అనేది పాపం అని మన పరిశుద్ధ గ్రంధం చెబుతుంది. ఇది దేవునికి నచ్చని ఒక చర్య. వ్యభిచారంలో పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు ఉంటారు. కాని మన సమాజం కేవలం స్త్రీలను మాత్రమే నిందిస్తుంది. మరియు స్త్రీలను మాత్రమే నేరంగా పరిగణిస్తుంది. అటువంటి స్త్రీలను సమాజం దూరంగా పెడుతుంది. వారిని అసహ్యంగా చూడటం వారిని దూరంగా పెట్టడం వంటి పనులు చేస్తుంది. అయితే బాధిత మహిళల్లో చాలా మంది కిడ్నాప్ చేయ బడటం మరియు వారి బంధువులు, కుటుంబ సభ్యులులచే వ్యభిచార గృహములకు అమ్మబడటం మనం ఎన్నో సార్లు చూసి ఉంటాం. వ్యభిచారం అనేది కచ్చితంగా పాపమే అందులో ఏ మాత్రం మార్పులేదు. మన దేవుడు పాపమును ద్వేషిస్తున్నారు. కాని పాపులను ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంధంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీని గూర్చి మనం చదువుతున్నాం. శాస్త్రులును, పరిసయ్యులను ఆమెను రాళ్లు రువ్వి ఆమెను కొట్టి చంపవలెను అని ఆమెను యేసు దగ్గరకు తీసుకొని వచ్చారు. యేసయ్య ఇచ్చిన సమాధానం వారి హృదయాల్లో గుచ్చుకొంది. మీలో పాపము లేని వాడు మొదట ఆమె మీద రాయి వేయమని వారితో చెప్పెను. అందరూ ఆ మాట విని పెద్ద వారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకరు బయటకు వెళ్లిరి. అయితే యేసు ఆమెను గద్దించ కుండా ఇక పాపము చేయకుము అని ఆమెతో చెప్పెను. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోవుచున్నారు అని పరిశుద్ధ గ్రంధం చెబుతుంది. కాబట్టి మనుష్యునిగా పుట్టిన అందరూ పాపులే. మనలను పాపము నుండి రక్షించుటకు యేసుక్రీస్తు సిలువలో వ్రేలాడదీయ బడ్డారు.



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet