Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.08.2022
Share:

By Village Missionary Movement

Thursday, 04-Aug-2022

దిన ధ్యానము(Telugu) 04.08.2022

 

అంశం:- ద్వేషం.

 

"సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి" - ఎఫెసీయులకు 4:31

 

16 ఏళ్ల జిమ్మి బుక్ నర్స్ అనే స్వీడన్ యువకుడు పాఠశాలలో చదువుకొంటున్న అతను స్నేహితులు లేక ఒంటరిగా ఉండేవాడు. అతనితో కలిసి చదువుకొంటున్న కొందరు నల్ల జాతి విద్యార్థులు అతనిని ఎగతాళి చేస్తూ హేళన చేసి క్రిందకు త్రోసి వేసేవారు. ఇలా చాలా సార్లు జరిగింది. ప్రారంభంలో జిమ్మి హేళన చేసే వారిని మాత్రమే ద్వేషించు కొనేవాడు. కాని చివరికి పాఠశాలలో ఉన్న నల్ల జాతి విద్యార్థులు అందరిని ద్వేషించడం ప్రారంభించాడు. ఆ తరువాత వారు నివసిస్తున్న దేశం పట్ల మతొన్మాద ద్వేషం కలిగింది. చివరికి జిమ్మి నేషనల్ సోషల్ ఫ్రంట్ అనే శ్వేత జాతి ఆధిపత్య సమూహములో చేరాడు. ఈ కథనం యొక్క ఉద్దేశ్యం ఏమనగా స్వీడన్ దేశంలో సరిగ్గా చదువుకొని ఉద్యోగ అవకాశం లేని యువతను సేకరించి మీకు కలిగిన ఈ దుస్థితికి ఇతర దేశాలు నుండి ఉద్యోగంనకు వచ్చిన వారే అన్నాడు. అందువలన వీరు తమ దేశస్తులు కాక ఇతర దేశస్తులు కనిపిస్తే కొట్టడం మరియు బయపెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. హిట్లర్ వంటి వారు వ్రాసిన నాజీ సూత్రాలు వంటి పుస్తకాలను వీరు ఇష్టపడేవారు. ఒకసారి జిమ్మి మరియు మరికొందరు ఆసియా నుండి వచ్చిన కొందరిని కొట్టి వారిని హింసించారు అని పోలీసులు విని వారిని అరెస్టు చేశారు. దానిని బట్టి అవమానానికి గురైన జిమ్మి ఆ సమావేశము నుండి తప్పుకున్నాడు. ఆ సంఘటన రీడర్స్ డైజెస్ట్ అనే పత్రికలో ముద్రించబడింది. పై సంఘటనల్లో కొంత మంది పైన ఏర్పడిన ద్వేషం ఆ జాతి అందరి పైన మరియు ఆ దేశ ప్రజల పైన ద్వేషం పెంచుకొనే విధంగా పెరిగిపోయింది. 

 

ప్రియమైన వారలారా! ఒక నిర్దిష్టమైన ఊరిలోనుండి పెండ్లి కుమార్తెగా వచ్చిన స్త్రీ యొక్క గుణం సరిగ్గా లేనట్లయితే పలాన ఊరికి చెందిన ఆడవాళ్లు అహంకారంతో ఉన్నారని ఆ ఊరి స్త్రీలకు పెండ్లి చేసుకోకూడదు అని కొంత మంది అంటారు. అన్యభాషాలను మాట్లాడే ఒకరు చేసిన తప్పు వలన అన్యభాషాలు మాట్లాడే వారందరు దుష్టులు అని కొందరు అంటారు. ఒక నిర్దిష్ట మిషనరీ సంస్థలో ఒకడు మంచిగా లేకపోతే వందలాది మంది ఉన్న ఆ సంస్థ మంచిది కాదు అంటారు. ఇటువంటి లెక్క పూర్తిగా తప్పే. ఏదైనా ఒక విషయం ఆలోచించి ప్రశాంతంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఒక వ్యక్తి మీదనైనా ఒక సమాజం మీదనైనా ఇటువంటి ద్వేషం మనలో కలుగ కుండా కాపాడుకుందాం. ఆ ద్వేషం మన సమాజాన్ని పాడు చేసేస్తుంది కాబట్టి అన్నింటిని నిదానించి ఆలోచించి చేద్దాం. 

- బ్రదర్. జె. సంతోష్ గారు.

 

ప్రార్థన అంశం:

ఇంటింటా జరుగుతున్న ప్రార్థన కూటములలో ప్రతి ఒక్కరు దేవుని ఆత్మతో నింపబడేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet