Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.08.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 02-Aug-2022

దిన ధ్యానము(Telugu) 03.08.2022

 

అంశం:- తప్పుడు ప్రవర్తన.

 

"యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును" - నహూము 1:7

 

19వ శతాబ్దంలో భారతదేశంలో దేవదాసీలు అత్యంత సామాజిక రుగ్మతగా పరిగణించబడ్డారు. భక్తులైన తన తల్లిదండ్రులు నృత్యం చెయ్యడానికి, దేవాలయాల్లో పరిచర్య చేయుటకు వదిలేసేవారు. ఆలయాల్లో పనిమనిషిగా ఉంచితే అది భగవంతునికి ప్రీతి కరముగా ఉంటుందని మరియు వారి పైన భగవంతుని అనుగ్రహం ఉంటుందని వారికి దేవదాసీలు అని పేరు పెట్టి సంతోషించే వారు. ఈ దుస్థితికి బలైపోతున్న మహిళలు చాలా మంది ఉన్నారు. అలాంటి తరాన్ని రక్షించడానికి లేదా ఆదుకోవడానికి ఎవ్వరు ముందుకు రాని పరిస్థితి. ఆ సమయంలో ఏమి కార్మిఖేల్ అనే తల్లి ఈ విపత్తును నిరోదించాలి అనే కోపంతో 1895లో ఐర్లాండ్ నుండి భారతదేశానికి వచ్చింది. చిన్న పిల్లలను, స్త్రీలను నాటక కంపెనీలకు అమ్మేసేవారు. అటుంవంటి అనైతిక జీవితాన్ని నిరోధించడానికి 1926లో ఏమి కార్మిఖేల్ డోనా ఊరు సొసైటీ ని స్థాపించారు. నిరుపేదలకు, వారి భర్తలచే విడువబడిన వారికి, విధవరాళ్ళకు ఆశ్రయం కల్పించడం ద్వారా ఆమె క్రీస్తు ప్రేమను తన క్రియలలో చూపించింది. ఈ వ్యవస్థకు పాలపుంత అని పేరు కూడా పెట్టారు. నేటికీ డోనాఊరు సొసైటీ వెయ్యి మందిని పైగా పోషిస్తూ వస్తుంది. నేటికి మురికివాడల్లో, బీదరికంలో జీవిస్తున్న మహిళలు తమ పేదరికాన్ని పారద్రోలేందుకు మరియు కుటుంబ పోషణకు వ్యభిచారం నీళ్ళ వలె త్రాగుతున్నారు. నేను పని చేస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో తన ముగ్గురి పిల్లలను విడిచిపెట్టి వేరొక భర్తకొరకు వెళ్లిపోయిన తల్లిని నేను చూసాను. మరొక కుటుంబంలో ఇద్దరి పిల్లలను ఒక మూసలావిడ దగ్గర విడిచిపెట్టి వారి తల్లిదండ్రులు వెళ్లిపోయారు. అలాంటి పిల్లలు రోజంతా ఆహారం లేక మద్యాహ్నం పాఠశాలల్లో పెట్టిన ఆహారం ఆతృతగా తినేవారు. చూసుకొనే వారు లేక చింపిరి జుట్టు మరియు మురికి దుస్తులతో వచ్చే పిల్లలను చూసి నేను చాలా బాధపడ్డాను. పాపులను రక్షించుటకే ఈ లోకమునకు మనుష్య కుమారునిగా వచ్చిన యేసు వ్యభిచారంలో చిక్కుకొని ఉన్న స్త్రీని క్షమించి నీవు వెళ్లి ఇక పాపము చేయకుము అని ఆమెతో చెప్పారు. క్రైస్తవునికి ఉండవలసిన ముక్యమైన లక్షణం క్షమాపణ మన అందరి యొద్ద ఉన్నదా?

- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు.

 

ప్రార్థన అంశం:-

మిషనరీ పిల్లల యొక్క విద్యాపరమైన అవసరతలు సంధింపబడేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet holiganbet giriş casibom giriş bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet