By Village Missionary Movement
Monday, 01-Aug-2022దిన ధ్యానము(Telugu) 02.08.2022
అంశం:- భవిష్యత్తు క్షీణతలు.
"బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు" - సామెతలు 22:6
మనలో చాలా మందికి బెట్టేల్ శామ్యూల్ గారు తెలుసు. తన అనాధ ఆశ్రమములో ఉంటున్న విద్యార్థుల పట్ల అతని వైఖరి చాలా భిన్నంగా ఉంటుంది. కొందరు అల్లరి విద్యార్థులు హాస్టల్ వదిలి పట్టణంలో తిరుగుతూ ఉంటారు. కొన్ని సార్లు వారు సినిమా ధియేటర్ వద్ద మరియు షాపింగ్ లో ఇన్ కీపర్ ద్వారా రెడ్ హేం. హ్యాండెడ్ గా పట్టబడతారు. అలాంటి తప్పులు చేసిన విద్యార్థులను శిక్ష కోసం శామ్యూల్ గారి యొద్దకు తీసుకు వస్తారు. అతను మాత్రం తన ముందు అందరి ముందు తన విద్యార్థులకు తప్పేమీ తెలియదు అని చెప్పేవారు. అప్పుడు అతను తన సహా ఉద్యోగులను చూసి ధియేటర్ తలుపు వద్ద సినిమా చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరి కోసం భారం కలిగిన మరియు కన్నీరు కార్చి వారి కొరకు ప్రార్థన చేయుటకు వెళ్లి ఉండవచ్చు అని చెప్పి విద్యార్థులను లోపలకు పంపించేసేవారు. శామ్యూల్ గారు పిల్లలను కొట్టకుండా ప్రేమగా సరిదిద్దాలి అనే ఆలోచన కలిగి ఉండేవారు. ఆయన యొక్క ప్రేమాభిమానాలను చూసి వందలాది మంది విద్యార్థులు నేడు ప్రపంచంలోనే అనేక దేశాల్లో దేవుని కొరకు ప్రకాశిస్తున్నారు. తప్పు చేసిన పిల్లలను బెత్తంతో శిక్షించడమును గూర్చి పరిశుద్ధ గ్రంధం ఏం చెబుతోందో మనం చదువుతున్నాం. కాని అదే సమయంలో మన పిల్లలను మరింత ప్రేమతో సరిదిద్దాలని బైబిల్ మనకు ఎక్కువగా బోధిస్తుంది. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఎంత కఠినముగా వ్యవహరించినా వారి నుండి నేర్చుకున్న సందేశం లేదనేది వాస్తవం. దీనికి విరుద్ధంగా చాలా మంది చేదుగా మరియు చిరాకుగా మారతారు. మరియు వారు పెద్దయ్యాక సామాజిక వ్యతిరేకులుగా కూడా మారతారు. వాక్యముతో దేవుని ప్రేమతో మన పిల్లలకు బోధించి నడిపించుటకు ప్రభువు కృపను అనుగ్రహించును గాక! ఆమెన్.
- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు.
ప్రార్థన అంశం:-
మన సేవ పరిచర్యలలో ప్రయాసములలో దేవుని సంరక్షణ ఆజ్ఞాపించు లాగున మరియు వారిని మహిమ కరముగ వాడుకునే లాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250