By Village Missionary Movement
Monday, 01-Aug-2022దిన ధ్యానము(Telugu) 01.08.2022 (Youth Special)
అంశం:- చెడు ఆలోచన.
"మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను" - రోమీయులకు 1:28
దేవుడు మనలను స్త్రీ, పురుషులనుగా సృజించి తన యొక్క చిత్తప్రకారంగా కుటుంబముగా చేర్చి ఈ లోకం పరిపాలించుటకొఱకు దేవుని యొక్క పరిశుద్ధత సంతతిని అభివృద్ధి చేయుట కొరకు సృజించారు అని పరిశుద్ధ గ్రంధం సెలవిస్తుంది. కనుక వివాహ జీవితంలో స్త్రీ, పురుషులు ఐక్యము గా ఉండి వారు దేవుని కొరకు పిల్లలను కని పెంచాలి అనేదే మనకు ఇవ్వబడిన భాద్యత. అదే దేవుని నియమం కూడా కాని ఇటీవల మనుష్యులు దీనిని మార్చేస్తున్నారు. వివాహం తరువాత ఇంకొకరితో సంభంధం పెట్టుకోవడం వివాహం చెసుకొనకుండా లివింగ్ రిలేషన్ షిప్ అనే పేరుతో ఇష్టం ఉన్నంతకాలం కలిసి జీవించిన తరువాత విడిపోవడం. స్వలింగ సంపర్కం ఇలా చాలా రకాల పాపములలో మానవజాతి చిక్కిపోతూవుంది. ఇప్పటికి పచ్చిమదేశంలో ఇతర దూర దేశాలలో ఈ పరిస్థితి ఉంది. మన దేశానికి కూడా సర్వసాధారణం చొరబడినట్లు వ్యాపించింది. కాని ఇది దేవునికి హేయము అని మనం మరిచిపోకూడదు. దీనికి పరిశుద్ధ గ్రంధంలో చాలా ఉదాహరణలు కలవు. పాతనిబంధనలో ఒకటికంటే ఎక్కువ వివాహములు అంగీకరించినప్పటికి అవి దేవునికి ఇష్టమైనవి కావు.
దావీదు బత్షెబతో పాపం చేయుటవలన కలిగిన ప్రభావం మనం ఎరిగి యున్నాం. అదేవిధముగా క్రొత్తనిబంధన కాలంలో ఒకరికి ఒకరే నియమించబడినది. అది మాత్రమేకాదు వివాహం తరువాత విడిపోయి మరొకవివాహం చేసుకోవడం కూడ దేవుని దృష్టిలో అంగీకరింప బడనిదే. స్వలింగ సంపర్కం అనే పాపం వలన సొదొమ గొమొఱ్ఱాలకు ఏర్పడిన పాపం మనం ఎరిగినదే ఇటువంటి మనుష్యులు తమ ఆత్మను, శరీరమును మోహానికి కామానికి అప్పగించుకుంటారు. తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లక పోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించెను అని పరిశుద్ధ గ్రంధం సెలవిస్తోంది.
ప్రియమైన యవ్వనులరా! ఇటువంటి పాపపు వలలో చిక్కుకొనకుండా దేవున్ని హత్తుకొనండి. ఇప్పుడున్న సోషల్ మీడియా, ఇంటర్నెట్, వెబ్సైట్ వలన సులభముగా ఎదుటి వారితో అలవాటు పడుతున్నాం. కాని దేవుని నియమం అనేది వివాహమునకు తరువాత కలిగిన ప్రేమే. అతను అతని యొక్క సొంత భార్యను, ఆమె అమెయొక్క సొంత భర్తను హత్తుకొని ఉండాలి అని పరిశుద్ధ గ్రంధం మనలను హెచ్చరిస్తోంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథమును ధ్యానించి దేవున్ని హత్తుకొనండి. మీ హృదయములను చెడు ఆలోచనలనుండి తప్పించి కాపాడుకొనండి. ఆమెన్.
- శ్రీమతి. భువన ధన బాలన్ గారు.
ప్రార్థన అంశం:-
ఈ నెల అంతా జరుగబోయే పరిచర్యలో దేవుడు తన మహిమను బలయలు పరచులాగున ప్రార్ధిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250