Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.07.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 31-Jul-2022

దిన ధ్యానము(Telugu) 31.07.2022 (Kids Special)

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

"మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి" - మార్కు 16:15

 

హాలో పిల్లలు! అందరూ ఎలా ఉన్నారు. బాగున్నారా? సరే. సరే ఈరోజు చరణ్ తమ్ముడు కోసం తెలుసు కొందాం. చరణ్ అనే తమ్ముడుకు రెండు కాళ్ళు అంగవైకల్యం కలిగి ఉన్నాయి. తన తల్లిదండ్రులు నడవలేని తనను ప్రయోజనం లేని వాడు అని దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో గల బస్ స్టాండలో వదిలి వెళ్లిపోయారు. ఎవరైనా తన పైన కనికరించి ఆహారం పెడితే ఆరోజు తన కడుపు నిండుతుంది. ఎండ, వాన, చలి అతనికి తోడు. ఒక రోజు తన జీవితంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. చెత్త కుప్పలో దొరికిన వస్తువులు అమ్ముతున్న ఒక వయస్సు అయిన అమ్మ తనను చూసి కనికరించి తాను ఉంటున్న చిన్న గుడిసెకు తనను తీసుకువెళ్ళింది. ఆమె ప్రేమతో ప్రతి రోజు తనకి ఆహారం అందించి చక్కగా చూసుకొనేది. అమె దేవుని కుమార్తె కావడంతో ప్రతి రోజు ప్రార్థన చేసి బైబిల్ చదువుతూ ఉండేది. చరణ్ కు ప్రార్థన చెయ్యడం నేర్పించింది. వ్రాయటం చదవడం తెలియని చరణ్ కు వ్రాయటాన్ని చడవడాన్ని నేర్పించింది. మనం ప్రభువు కొరకు ఏదైనా చెయ్యాలి అని భారం మాటిమాటికి తనతో పంచుకొనేది. ఒక రోజు ఆ అమ్మ మరణించింది దుఃఖం తో ఉన్న చరణ్ కు మానవత్వంతో ఉన్న ఒకాయన చరణ్ ను ప్రభుత్వ సంరక్షణ గృహమునకు తీసుకొని వెల్లబడ్డాడు. తనకు ఇవ్వబడిన స్థలం ఏదనగా మొదటి అంతస్తులో ఉన్న కిటికీ దగ్గరే. అక్కడ కూడా ప్రతి రోజు ఎప్పటి లాగానే ప్రార్థిస్తూవుండేవాడు. ప్రభువు కొరకు ఏదైనా చెయ్యాలి అని తన మనస్సులో ఉండేది. కాని ఇటువంటి పరిస్థితుల్లో నేను ప్రభువు కొరకు ఏమి చెయ్యాగలను అని అనుకొంటూ కృంగిపోయేవాడు. ఒక రోజు తనను చూడటానికి వచ్చిన ఒక వ్యక్తి యొద్ద ఒక నోట్ బుక్ మరియు పెన్ను అడిగి తీసుకున్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్ చింపి బైబిల్లో ఉన్న వాక్యమును ఆ పేపర్ మీద వ్రాసి దానిని చుట్టి కిటికీ నుండి క్రిందకు పడేసేవాడు. అదే తాను చేసిన సేవ. 

 

ఒక రోజు ఒక యవ్వనురాలు ఒంటరి తనం వలన ఆత్మ హత్య చేసుకోవాలి అని ఆ దారిలో వెళ్తూవుంది. అదే సమయంలో చరణ్ వ్రాసి విసిరిన వాక్యం ఆమె తలపై పడటం వలన దానిని విప్పి చూసింది. అందులో భయపడకుము నేను నీకు సహాయం చేసెదను అనే వాక్యం వ్రాయబడి ఉన్నది. ఆ వాక్యం చదివిన ఆమె దైర్యం తెచ్చుకొని తన మనస్సును మార్చుకొని ఆమె ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. తన జీవితం మార్చబడింది. ఎవరికి ప్రయోజనం లేని చరణ్ ఎంతోమందికి ఆశీర్వాద కరముగా మారాడు. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన తమ్ముడు చెల్లి, నీవుకుడా యేసయ్య కొరకు ఏదైనా చేసావా? ఆలోచించి చూడు నడవలేని చరణ్ యేసయ్య కొరకు సేవ చేయగలిగితే నీవు ఊరకనే ఉండవచ్చా? నీ శక్తి కొలది సేవను చేయుట మొదలు పెట్టు సరేనా! సరే పిల్లలు మన శక్తి కొలది మనం దేవుని కొరకు గొప్ప కార్యములు చెయ్యాలి అని నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఒక కంఠత వాక్యం కూడా నేర్చు కొందామా.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet