Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.02.2021
Share:

By Village Missionary Movement

Friday, 05-Feb-2021

దిన ధ్యానము(Telugu) 05.02.2021

మేలు కొరకే:-

"అయినను మనము కొట్టుకొనిపోయి యేదైన ఒక ద్వీపముమీద పడవలసి యుండునని చెప్పెను" - అపో.కార్యములు 27: 26

కరేబియన్ సముద్రంలో వెళ్తున్న నావ ఒకటి ప్రమాద కరమైన వాతావరణంలో చాలా ఇబ్బందికి గురియైనది. ఆ నావికుడు బయపడిపోయినట్టుగానే ఆ నావ వేరే దిక్కునకు వెళ్ళడం ప్రారంబించింది. చివరకు బండరాయిని గుద్ది నావ పగిలిపోయింది. అందులోగల  కొందరు మరణించారు. మరణించిన వారిలో ఒక బోధకుని బార్యకుడా ఉన్నారు. మిగిలిన వారు వాళ్ళ  వాళ్లకు దొరికిన చెక్క ముక్కలు పట్టుకొని  ప్రక్కనే ఉన్న దీవికి చేరుకున్నారు. దానిని చూచిన బోధకుడు జీవితపు అంచులకు చేరుకున్నట్లు  కృంగి  పోయారు. ఏమి చేయాలో తెలియక అంగలార్చుతూ ఉన్న ఆ బోధకుని యొద్దకు ఆ దీవిలో ఉన్న ఒకరు వచ్చి అయ్యా దేవునికి వందనములు అన్నారు. ఆయన తన ఏడ్పును అపుకొని నన్ను  మీకు ఎలా తెలుసు? అని అడిగారు అందుకు వారు అనేక దినముల నుండి మాకు ఒక బోధకుడను పంపించండి అని దేవునికి ప్రార్థన చేస్తున్నాము. మా ప్రార్ధనకు వచ్చిన జవాబే మీరు అని అన్నారంట. వేదన యొక్క శికరములో ఉండిన సేవకుడు దేవుని యొక్క నడిపింపును చూసి ఆశ్చర్యపోయి దేవున్ని మహిమ పరిచారు. అవును మన యొక్క జీవితంలో కూడా జరుగుతున్న ప్రతి తుఫాను వంటి కార్యములు మధ్యలో కూడా  దేవుని అద్భుత, ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. 

ఈదిన లేఖన భాగంలో కూడా పౌలు ప్రయాణం చేసిన నావ వాతావరణంలో మార్పులు వలన అనేక దినములు సముద్రంలో ఉండి పోవుట బైబిల్లో చూస్తున్నాం. ఆఖరికి నావ ఒక దీవికి చేరుకుంది గనుక ప్రాణములతో బయట పడ్డారు. వెళ్ళాలి అని బయలుదేరిన స్థలమునకు వెళ్ళకుండ చిరునామా తెలియని ఒక స్థలమునకు పౌలు తీసుకొని వెల్లబడ్డాడు. ఆలాగు వెళ్లిన ఆ దీవిలో పౌలు కొరకు దేవుడు పరిచర్యను సిద్ధపరిచారు. దేవుని చిత్తాన్ని కేంద్రీకృతం చేసుకున్న వాళ్ళ జీవితంలో ఏమి జరిగినను అది మేలు కొరకే జరుగును. ఈ సందేశాన్ని చదువుతున్న మీ ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నరు. మీరు దాటి వెళ్ళవలసిన పరిస్థితులు భిన్నంగా ఉండేటప్పుడు జీవితంలో ఏదో పొరపాటు జరుగుతుంది అని తలంచవద్దు. దేవుడు కీడును మేలుగా మార్చగలిగిన దేవుడు మీతో ఉన్నారు. ఆయన ఆశ్చర్య కరమైన మార్గములను మీ కొరకు సిద్ధం చేస్తున్నారు.
-    బ్రదర్. పి. జాకబ్. శంకర్

ప్రార్థన అంశం:-
మన పార్టనర్స్ మిషనరీల ద్వారా దర్శించబడుతున్న మందిరములు లేని గ్రామాల్లో మందిరములు కట్టబడేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al