Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.07.2022
Share:

By Village Missionary Movement

Saturday, 30-Jul-2022

దిన ధ్యానము(Telugu) 30.07.2022

 

అంశం:- కృతజ్ఞతను ఆశించవద్దు.

 

"మనము మేలుచేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము" - గలతియులకు 6:9

 

మనం జీవిస్తున్న ఈ విభిన్నమైన ప్రపంచంలో చాలా రకాలైన ప్రతికూల లక్షణాలు కలిగిన మనుష్యులు ఉన్నారు. మనం దేవుని కృపపై అనుకోని ఉన్న వారివలె సాక్ష్యం గల వారి వలె వారి మధ్యన జీవించాలి. పరిశుద్ధ గ్రంధంలో గల న్యాయాధిపతుల గ్రంధంలో కృతజ్ఞత లేని వారి కొరకు మనం చూస్తున్నాం. న్యాయాధిపతులు 6:1-2 వచనాల్లో మిద్యానీయుల చేతికి అప్పగింపబడి నివాసమునకు, ఆహారమునకు 7 సంవత్సరాలు చాలా కష్టపడిన ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతిలోనుండి విడిపించి గిద్యోనుకు ఇశ్రాయేలీయులు కృతజ్ఞత తెలుపకుండా బదులుగా గిద్యోను కడుపున పుట్టిన 70మంది కుమారులను చంపుటకు సిద్ధం అయ్యారు. మోషే తాను ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోని అల్ప కాల పాపబోగమును ద్వేషించి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి తన సహోదరుని కలుసుకొనుటకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు అతనిని అంగీకరించక కృతజ్ఞత లేనివారి వలె ఉన్నారు. 

 

ప్రియమైన వారలారా! మీ జీవితంలో మీ ద్వారా మేలులు. పొందుకున్న వారు మీకు విరోధముగా నిలబడవచ్చు. ప్రభువు మీ ద్వారా ఒకరిని లేదా ఒక కుటుంబమును పెంట కుప్పనుండి సింహాసనమునకు హెచ్చించ ఉండవచ్చు. వారు మాత్రం ప్రభువు మరచి మిమ్మును, మీ కుటుంబమును అవమానపరిచే వారివలె మారి ఉండవచ్చు. ఇలా ఉండగా గలతి 6:9లో చెప్పబడిన విధముగా మనము మేలు చేయుట యందు విసుకకయుందుము ఎందుకు అనగా మనలను శ్రమ పెట్టే విషయాల్లో మనం కలతతో ఒక మూలన ఉన్నట్లు అయితే మనం కృంగినవారం అవుతాము. కాని మనం అలయక మేలు చేసితిమి అనియు తగిన కాలం అందు పంట కోతుము అని పరిశుద్ధ గ్రంధం సెలవిస్తుంది. కాబట్టి మనుష్యుల యొద్దనుండి కృతజ్ఞతను లేదా మెప్పును ఆశించ కుండా ఉందాం. మీరు విశ్రాంతి గల వారి వలె మీ ఆత్మలను అలసిపోకుండా మీకు విరోధముగా క్రియలను జరిగిస్తున్న ఇటువంటి పరిస్థితులను సహిస్తూ ప్రభువు వైపు చూస్తూ ఆయననే తలంచు కొనుడి.

- బ్రదర్. కె. బెంజమిన్ గారు.

 

ప్రార్థన అంశం:-

తమిళనాడులో ప్రతి శనివారం జరుగుతున్న ఉజ్జీవమును ఆశించే వారి కూటముల కొరకు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet