Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.07.2022
Share:

By Village Missionary Movement

Thursday, 28-Jul-2022

దిన ధ్యానము(Telugu) 29.07.2022

 

అంశం:- కృతజ్ఞతులై యుండుడి.

 

"క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి" - కొలస్సీయులకు 3:15

 

జర్మనీ అర్జెంటైనను ఫైనల్ లో ఓడించిన ప్రపంచ ఫుడ్ బాల్ కప్ ను గెలిచింది. అయితే అదనపు సమయంలో జర్మనీకి చెందిన మారియో గోల్ చేసి తన దేశానికి విజయం అందించాడు. దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. దేవా నేను మీకు ఏమి అడగలేదు కాని మీరు నాకు ఇచ్చిన సమస్తము కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని చెప్పడం ఆశ్చర్యకరమే.

 

మోయాబీయులును అమ్మో నీయులును యెహోషాపాతు మీదికి వచ్చిరి. అప్పుడు యెహోషాపాతుతో ఉన్న ప్రజలు అందరూ కూడి దేవున్ని వేడుకున్నారు. వారు పాడుటకును, స్తుతించుట మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన మోయాబీయుల మీదను అమ్మో నీయుల మీదను మరియు శేయీరు మాన్య వాసుల మీదను మాటు గాండ్రును పెట్టెను గనుక వారందరు హతులైయిరి. యెహోషాపాతు రాజు మరియు ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుతూ దేవున్ని స్తుతించారు. 

 

యేసుక్రీస్తు ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్టు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మును కరుణించమని కేకలు వేసిరి. వెంటనే యేసు వారిని స్వస్థపరిచారు. వారిలో ఒకడు మాత్రమే తిరిగి వచ్చి కృతజ్ఞత స్తుతులు చెల్లించిరి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరికార ఆ తొమ్మిది మంది ఎక్కడ అని అడిగారు. కనుక యేసుక్రీస్తు కూడా కృతజ్ఞత కోరుకొని అడిగారు అని మనం గ్రహించవచ్చు. యేసు తాను అప్పగించబడిన రాత్రి గిన్నెను ఎత్తి కృతజ్ఞత స్తుతులు చెల్లించి శిష్యులకు ఇచ్చునట్లు మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు అన్నింటిలో కృతజ్ఞత చెల్లించి మనకంటే ముందు జీవించి మనకు చూపించారు. మనము కూడా సమస్త విషయములో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుడు కూడా మనకు అదే నేర్పించారు. స్తుతియాగము చెల్లించు వాడు నన్ను మహిమ పరచు చున్నాడు అని కీర్తన 50:23లో మనం చూస్తున్నాం. కాబట్టి మనం అన్ని సమయాల్లో మరియు అన్ని కార్యములలో ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించుట నేర్చుకొందాం. ఇంపుగా ఉన్న సమయాల్లో మాత్రమే కాదు తక్కువగా ఉన్న సమయాల్లో కూడా ఆశీర్వాదములు ఉన్నా లేకపోయినా సరే మొదటిగా మనం కృతజ్ఞతలు తెలుపుట నేర్చుకొందాం. అదే మనకు తగినది.

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు.

 

ప్రార్థన అంశం:-

తమిళనాడులో చర్చిలు లేని గ్రామాల్లో చర్చిలు కట్టుటకు చేస్తున్న ప్రయాసలో దేవుడు ఆశీర్వదించు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet