Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.07.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 27-Jul-2022

దిన ధ్యానము(Telugu) 27.07.2022

 

అంశం:- కోపం.

 

"యెహోవా కయీనుతోనీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చు కొని యున్నావేమి" - ఆదికాండము 4:6

 

బెల్జియం అనే దేశంలో ఉన్న ఆంట్ వ్యాప్ అనే నగరంలో ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు. పోలీసులు విచారణలో ఆమె పేరు మరియ వెళ్లిండన్ అనే తేలింది. ఆమె పదవి విరమణ చేసిన ఒక ఉపాధ్యాయురాలు అని తెలిసింది. 2020 నవంబర్ నెలలో జరిగిన ఈ హత్యలో చాలా రోజుల తరువాత ఉవెంట్స్ అనే హంతకుడు జైల్లో బందించబడ్డాడు. హంతకుని యొక్క మాటలు విన్న అనేకులు భయంతో వణికిపోయారు. హత్య చేయబడిన వెళ్లిండన్ తన యొక్క మొదటి తరగతి ఉపాధ్యాయురాలు అని నా తరగతి మధ్యలో అందరి ముందు నన్ను దారుణంగా తిట్టి నన్ను హేళన చెయ్యడం నేను తట్టుకోలేక పోయాను అని ఉవెంట్స్ చెప్పాడు. ఉపాద్యాయురాలు మీద పగ తీర్చుకోవాలి అనే ఆలోచన నాలో పెరుగుతూ ఉండేది. ఒకరోజు రోడ్డు మీద నడుచుకొంటూ వెళ్తున్న ఆమెను చూసిన వెంటనే నన్ను నేను అపులేకపోయాను. కత్తితో ఆమె శరీరం పైన 101 సార్లు పొడిచి హత్య చేసాను అని చెప్పాడు. ఇందులో తమాషా అయిన విషయం ఏమిటి అంటే ఉవెంట్స్ భక్తి కలిగిన క్రైస్తవుడు అని ఇల్లు లేని పేద ప్రజలకు తాను చేయగలినినంత సహాయం చేసి సహాయ పడతాడు అని అతని యొక్క ఇంటి ప్రక్కన ఉన్న వారు చెప్తున్నారు. 30 సంవత్సరాల తరువాత జరిగిన ఈ పగ తీర్చుకోనుట అనే ఈ సంఘటన మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. 

 

పరిశుద్ధ గ్రంధంలో ఆదికాండం 4వ అధ్యాయంలో జరిగిన ఒక హత్యను గూర్చి మనం చదువుతున్నాం. తన యొక్క ప్రవర్తన చెడ్డది అని ఎరిగి కూడా తన సహోదరుడైన హేబేలును ప్రతీకారంతో హత్య చేశాడు కయ్యీను. ఎవరైనా తమలో కోపానికి చోటిచ్చినట్లయితే అక్కడ హత్యలు నిండి ఉంటాయి. ద్వేషం, కోపం, ప్రతీకారం వంటి స్వభావములు అన్నీ సాతాను యొక్క స్వభావములే. అపోస్తులుడైన పౌలు ఎఫెస్సీయులకు వ్రాసిన పత్రికలో అపవాదికి చోటు ఇయ్యకుడి అని వ్రాస్తున్నారు. స్వభావములతో తప్పు చేసిన వారు తమ ఆయుస్సును కోల్పోతారు. దీనికి పరిశుద్ధ గ్రంధంలో అనేక సంఘటనలు చెప్పబడి ఉన్నవి. గలతి 5వ అధ్యాయంలో 22, 23 వచనాల్లో చెప్పబడిన విధముగా ఆత్మ ఫలము అయిన 9 స్వభావములను పొందుకొని వాటిని పెంచుకొనుటకు ప్రార్థనతో ఉందాం. ప్రభువు మనకు సహాయం చెయ్యును గాక! 

- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు.

 

ప్రార్థన అంశం:-

టీవీలలో బయలు పడుతున్న కార్యక్రమాల ద్వారా దేవుని కొరకు పనిచేసే వ్యక్తులను దేవుడు లేపులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet