Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.07.2022
Share:

By Village Missionary Movement

Monday, 25-Jul-2022

దిన ధ్యానము(Telugu) 26.07.2022

 

అంశం:- దాచబడిన ధనము.

 

"పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది" - మత్తయి 13:44

 

ఇంగ్లాండ్ లో పీటర్ వాటిల్లింగ్. అనే రైతు జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఇతను తన వ్యవసాయ పని చేస్తూ ఉండగా ఆ తోటలో ఒక సుత్తిని పోగొట్టేసాడు. దానిని అలాగే వదిలేస్తే వ్యవసాయ యంత్రాలకు ఏదైనా ముప్పు కలుగుతుంది అని దానిని వెతికే పనిలో మునిగిపోయాడు. ఆ విస్తారమైన పొలములో తన స్నేహితుడైన ఎరిక్ తో కలిసి సుత్తిని వెతుకుతున్నాడు. కాని ఆ సుత్తి దొరకలేదు అయిన 24 కంచు నాణెములు, 565 బంగారు నాణెములు, 15000 వెండి నాణెములు మరియు 200 ఇతర నాణెములు దొరికాయి. చట్ట ప్రకారముగా మొదట ఇతను పోలీసులకు తెలియజేశాడు. మరుసటి రోజు ఒక తవ్వకదారుల నిపుణుల కుటం అక్కడికి వచ్చి తవ్వడం ప్రారంభించినప్పుడు పోయిన సుత్తి దొరికింది. ఇదే విధంగా నిధిని కనుగొనే వారికి కనుగొనబడిన వస్తువుల విలువను బహుమతిగా ఇవ్వాలి. అందుకే దొరికిన ఆ 16 కోట్లా రూపాయలను పీటర్ మరియు అతనికి సహాయం చేసిన ఎరిక్ సమానంగా పంచుకున్నారు. ఈ నిధిని కనుగొన్న వారి యొక్క సంతోషమునకు హద్దులే లేవు. అయితే అంతకంటే గొప్ప నిధులను దేవుడు మనకోరకు పరలోకంలో ఉంచారు. 

 

పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలీయున్నది అని యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు. దానిని కనుగొన్నవారు ఆ నిధిని కనుగొన్న వారి సంతోషం కంటే వెయ్యి రెట్లు అధికంగా సంతోషిస్తారు. అయితే ఆ పరలోక నిధిని పొందుకొనుటకు ఒకేఒక కండిషన్ మాత్రమే ఉంది. అదేమనగా యేసుక్రీస్తు యొక్క విలువైన రక్తముతో కడగబడాలి.అలా కడగబడితే ఆయన యొక్క కృప యొక్క మహా ఐశ్వర్యం కనుగొంటే ఈలోకం, ధనం, ఆస్తి అన్ని మనకు పెంట కుప్ప వలె కనబడతాయి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తంలో మీరు కడుగబడ్డారా? యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. ఆయన పరిశుద్ధ రక్తమే మనలను కడగగలదు. పరలోక రాజ్యమునకు మనలను అర్హులుగా చేయగలదు. మనం ఆయన రక్తంలో కడగబడుటకు ఈరోజే మనలను సమర్పించు కొందాం. ఆయన మనలను పవిత్ర పరిచి పరలోకరాజ్యం మనకు ఇస్తారు. 

- బ్రదర్. హరీష్ శామ్యూల్ గారు.

 

ప్రార్థన అంశం:-

ప్రార్ధనలతో మరియు కానుకలతో పరిచర్యను సపోర్ట్ చేస్తున్న భాగస్వాముల యొక్క పిల్లల విద్య, వ్యాపారం, ఉద్యోగం అన్నీ ఆశీర్వదించబడేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al