Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.07.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Sunday, 24-Jul-2022

దిన ధ్యానము(Telugu) 25.07.2022 (Youth Special)

 

యవ్వనుల కొరకు ప్రత్యేకమైన సందేశం.

 

అంశం:- ఇది వింత కాదు.

 

"మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠినహృదయము గలవారైయున్నారా" - మార్కు 8: 17

 

ఆలయంలో కానుక పాటలు పాడినప్పుడు షర్ట్ జేబులో 10రూపాయలు లేకపోతే 50 రూపాయలు తీసి కానుక పెట్టెలో వేసినప్పుడు ఆ డబ్బు ఎక్కువగా అనిపిస్తుంది. కాని స్నేహితులతో షాపింగ్ మాల్స్ కు వెళ్ళినప్పుడు అదే డబ్బు చాలా తక్కువగా అనిపిస్తుంది. ఇది చాలా వింతగా ఉంది కదా! ఆరాధనకు వెళ్లి రెండున్నర గంటల కూర్చుంటే అది చాలా ఎక్కువ సమయం అనిపిస్తుంది. కాని సినిమా చూసినప్పుడు అదే రెండున్నర గంటలు చాలా తక్కువగా అనిపిస్తున్నాయి ఇది కూడా చాలా వింతగా ఉంది కదా! పరిశుద్ధ గ్రంధంలో ఒక అధ్యాయం చదివితే ఏదో పోరాడినట్లు అనిపిస్తుంది కాని అదేవిధంగా కవితలు, కధల పుస్తకాలలో వందల కొలది పేజీలు చదివినప్పుడు బోర్ కొట్టకుండా ఉంటుంది ఇది కూడా వింతగా ఉందిగా కదా. సంఘంలో ఒక స్పెషల్ మీటింగ్ కోసం రెండు వారాలు నుండి ప్రకటిస్తే వాటిని జాగ్రత్తగా విన్న మనం ఏదో పార్టీ ఉంటే సంఘంలో జరుగుతున్న మీటింగ్ ను తప్పిపోతున్నాం ఇది వింత కదా. కలశాల ముగిసిన వెంటనే 15 నిమిషాలు ప్రార్థన మీటింగ్ కు రమ్మంటే బస్ వెళ్ళిపోతుంది అని త్వరత్వరగా వెళ్లిపోతున్నాం అదే మనం స్నేహితులు ఇచ్చే బర్తడే ట్రీట్ ఉంటే మరి బస్ కోసం అలా వెళ్లడం లేదే మరి ఇది వింత కదా! వార్తా పత్రికలను, టీవీ న్యూస్ లో ఉన్నది వున్నట్లుగా నమ్ముతున్న మనం పరిశుద్ధ గ్రంధంలో చెప్పబడుతున్న వాటిని విన్నప్పుడు అనేక ప్రశ్నలు, సందేహాలు కలుగుతున్నాయి ఇది వింత కాదా! ఒక బస్ డ్రైవర్ ను నమ్మి దైర్యంగా ఎక్కుతున్న మనం మనలను సృజించిన దేవున్ని మన జీవితమును ఆయనకు అప్పగించడానికి వెనకాడుతున్నాం ఇది వింత కదా? ఇంట్లో ఖర్చుల కొరకు ఎప్పుడో ఒకసారి 100 రూపాయలు అడిగిన అమ్మకు అనేక ప్రశ్నలు వేస్తున్న మనం కాని హెల్మెంట్ వేసుకోక పోతే పోలీస్ దగ్గర టక్కున 100 రూపాయలు ఇచ్చేస్తున్నాం ఇది వింత కదా? ఆలయంలో ఒక ఆత్మీయ పుస్తకమును కొనుటకు వెళ్లినప్పుడు ఇంట్లో డబ్బులు ఇవ్వరు అని చెప్పే మనం లేటెస్ట్ మోడల్ డ్రెస్ కొట్టడానికి మనం 500 నుండి 600 రూపాయలు ఇచ్చేస్తున్నామే ఇది వింత కదా? పరలోకంలో ఎలాగైనా స్థానం సంపాదించు కోవాలి అని ఆశించిన మనం మరణించుటకు ఇష్టపడడం లేదు ఇది వింత కదా? 

- సహోదరి. కోకిల

 

ప్రార్థన అంశం:-

ప్రార్థన గుడారపు పనులు పూర్తి అయ్యి దేవుని నామ మహిమ కొరకు త్వరలో ప్రతిష్టించే విధంగా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al