Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.07.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 24-Jul-2022

దిన ధ్యానము(Telugu) 24.07.2022 (Kids Special)

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

"యెహోవా నా పక్షమున కార్యము సఫలముచేయును" - కీర్తనలు 138: 8

 

హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే కధ విందామా? ఒక దట్టమైన అడవిలో అన్ని రకాలైన జంతువులు జీవిస్తూ వస్తున్నాయి. అడవికి రాజు ఎవరు అని అడిగితే సింహం అని అంటారు కదా. ఈ అడవిలో కూడా సింహం చాలా మంచి రాజుగా ఉండేది. బ్రతికి ఉన్న జంతువులను చంపి తినకుండా చనిపోయిన జంతువులను మాత్రమే తింటూ ఉండేది. తన అడవిలో ఉన్న జంతువులతో కలిసి మెలిసి ఉండేది. కాని జంతువుల సంఖ్య తగ్గుతూ రావడం వలన ఒక సమావేశం ఏర్పాటు చేసింది. అడవికి వేటాడడం కోసం వస్తున్న వేటగాడిని ఎలా తరిమి వేయాలి అని మాట్లాడు కున్నాయి ఆ జంతువులు. రకరకాల ఆలోచనలు చెప్పిన ఆ సింహ రాజుకు తృప్తి కలుగలేదు. అడవిలో ఉన్న జంతువులను ఎలా కాపాడాలి అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొంది సింహం. రేపటి దినాన్న వేటగాడు రాకమునుపే ఈ చెట్ల పొదల్లో దాక్కుని వేటగాని ముందుకు ఒక జంతువు మాత్రమే ఒంటరిగా వెళ్ళాలి. వేటగాని దృష్టి అంతా ఆ జంతువుపైన ఉన్నప్పుడు మనం అందరం కలిసి అతని పైన దాడి చెయ్యాలి. సరే ఆ వేటగాడి ముందుకు ఎవరు దైర్యంగా వెళ్తారు అని ఆ సింహం అడిగినప్పుడు అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. సరే ఎవరు వెళ్ళక పోతే నేను నా ఒకే ఒక సింహపు పిల్లను వేటగాడి ముందుకు పంపిస్తాను అని మాట ఇచ్చింది సింహము. దాంతో సమావేశం ముగిసింది జంతువులు అన్నీ వెళ్లిపోయాయి. మరుసటి రోజుకు అన్నీ కూడా అనుకున్న విధముగా తయారుగా ఉన్నాయి. వేటగాడు కూడా వచ్చాడు. సింహపు పిల్ల ధైర్యముగా వాడి ముందు నుండి వెళ్తూవుంది. ఆహా ఈరోజు వచ్చిన వెంటనే సరైన వేట అనుకొని బాణం విసిరాడు అది గురి తప్పకుండా ఆ బాణం సింహపు పిల్లను తాకింది. అదే సమయంలో జంతువులన్నీ కూడా కలసి వేటగాడి పైన దాడి చేసి వెళ్లిపోయాయి. రాజు తన పిల్లను కోల్పోయినప్పటికి అడవిలో జంతువులు అన్నీ కాపాడాబడ్డాయి అని తనకు తానే ఓదార్చుకొంది.

 

ప్రియమైన తమ్ముడు చెల్లి, అడవిలో ఉన్న జంతువులు అన్నీ సంరక్షణగా ఉండాలి అని తన పిల్లను కోల్పోయిన రాజైన సింహము వలె తండ్రి కూడా మనం సంతోషంగా ఉండాలి అని ఆయనకు ప్రియమైన పిల్లలు వలె సంరక్షణగా ఉండాలి అని తన ఒకే ఒక కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అప్పగించారు. నీ కొరకు సిలువలో సమస్తమును పూర్తిచేసిన యేసయ్య కొరకు నువ్వు కూడా ఏదైనా చెయ్యాలి. ఏంటి పిల్లలు చేస్తారు కదా! సరే పిల్లలు ఇప్పుడు మనం ఇక కంఠత వాక్యం నేర్చుకొందమా?

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al