Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.07.2022
Share:

By Village Missionary Movement

Friday, 22-Jul-2022

దిన ధ్యానము(Telugu) 23.07.2022

 

అంశం:- నా యొక్క ఆశ.

 

"నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును" - సామెతలు 23:5

 

నేను ఒక మొబైల్ ఫోన్ కావాలి అని చాలా రోజులుగా ప్రార్థిస్తున్నాను. కాని అది నాకు దొరకలేదు. అయినప్పటికీ ప్రార్థిస్తూనే ఉన్నాను. అప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. మొబైల్ ఫోన్ అడిగిన నాకు ఆత్మీయ వరమో లేదా ఆత్మ ఫలమో లేదా దేవుని ప్రసన్నతను ఇంకా పొందుకోవాలి అని లేక దేవుని చూడాలి అనే ఆలోచన ఎందుకు రాలేదు అని నాలో నేనే ప్రశ్నించుకొన్నాను. నశించే ఒక వస్తువుకు ఇచ్చే ప్రాముఖ్యతకు ఆత్మీయ వరమునకో లేదా ఆత్మ ఫలమునకో ఇవ్వకుండా వస్తువులకే నా హృదయం ఎక్కువగా ఆశ పడుతుంది అనుకొని చాలా సిగ్గు పడ్డాను. 

 

అనేక సమయాల్లో క్రైస్తవుల మైన మనము ముఖ్యముగా పరిచర్య చేస్తున్న వారుకుడా ఏలీషా వలె ఆశించకుండా గేహజీ వలె ఆశిస్తున్నాం. మనం లోకంలో ఉన్న వస్తువుల కొరకు క్రియల కొరకు అధికముగా ప్రయాస పడుతున్నాం. వాటిని కాపాడుకొనుటకు అధిక జాగ్రత్తను వహిస్తున్నాం. కాని అపోస్తులుడైన పౌలు నాకు లాభదాయకమైన లోక కార్యములు, ధనం, పేరు, ప్రసిద్ధి వంటి సమస్తమును నష్ట పరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని అన్నాడు. అది మాత్రమే కాదు పైనున్న వాటి మీదనే తప్ప భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని సలహా ఇస్తున్నాడు. పౌలు సేవకునిగా దేవున్ని సంతోష పరచుటయు, ప్రాముఖ్యత ఇచ్చుటయు ప్రధానముగా చేయడం వలన ఆయనకు లోకం పెంట వలె కనిపించింది. అవును మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నామో అదే మన ఆశగా మారిపోతుంది. ఎలీషా, ఏలీయా ఉన్న ఆత్మీయ వరం మరియు వారిపైనే ఉన్న అభిషేకం గొప్పగా కనిపించడం వలన వారి ఆలోచన అంతా వాటిపైనే ఉండేది. విడువని పోరాటంతో వాటిని పొందుకొన్నాడు అనేది ఎంతటి ఆశ్చర్యం. ఇవన్నీ తెలిసి కూడా గేహజీ మనస్సులో దేవుని కార్యం గూర్చి ఒక్క శాతం కూడా ఆశక్తి లేదు. 

 

ప్రియమైన వారలారా! లోక క్రియల కొరకు మరియు లోక సంబంధమైన వస్తువుల కొరకు ప్రాముఖ్యతను ఇచ్చి ప్రార్థిస్తున్నామా? మనకు ఏ అవసరం ఉన్నదో ఎరిగి యున్న పరమతండ్రి వాటిని తీర్చే శక్తిమంతుడై యున్నాడు. కాబట్టి దేవుని కార్యముల కొరకు ప్రార్ధించండి, పై నున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి.

- శ్రీమతి. బేబీ కామరాజ్ గారు.

 

ప్రార్థన అంశం:-

ప్రతి శనివారం జరుగుతున్న ఉజ్జీవం ఆశించే వారి కూటములో పాల్గొంటున్న వారి ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al