Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.07.2022
Share:

By Village Missionary Movement

Thursday, 21-Jul-2022

దిన ధ్యానము(Telugu) 22.07.2022

 

అంశం:- సంగీత వాయిద్యం మాట్లాడుతుంది.

 

"తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి" - కీర్తనలు 150:4

 

నా యజమానుడు చాలా గొప్ప ధనవంతుడు. ఏదో కారణం వలన తన ఉద్యోగంలో నష్టం జరగడం వలన తన ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ వేలం వేయబడ్డాయి. వచ్చిన వారంతా సామాన్లు అన్నింటిని కొనేసారు. సంగీత వాయిద్యం అయిన నేను మాత్రం ధూళి పట్టి వేలంలో అమ్మబడక ఒక మూలన ఉన్నాను. చివరిలో కూర్చొని ఉన్న బాగా వయస్సు అయిపోయిన నా యజమానుడు నా దగ్గరకు వచ్చాడు. నా పైన ఉన్న ధూళిని తుడిచి కొన్ని భాగాలను సరిచేసి నన్ను చేతిలోనికి తీసుకొని ఒక అందమైన పాట పాడాడు. అందరూ ఆ పాటకు అందరూ మైమరచిపోయారు. తరువాత నేను చాలా ఎక్కువ ధరకు అమ్మబడ్డాను. నేను అమ్మబడుతున్నప్పుడు అప్పటి వరకు నేను నా యజమానుడి మొఖం లో చూడని సంతోషం ఒక్క సారిగా ఆయన సంతోషించడం చూసాను. 

 

పరిశుద్ధ గ్రంధంలో చాలా మంది సంగీత వాయిద్యమైన నన్ను ఉపయోగించారు. ఎర్ర సముద్రమును దేవుడు రెండుగా చీల్చి ఇశ్రాయేలీయులను నడిపించిన అద్భుతం జరిగినప్పుడు మిర్యాము అనే ప్రవక్తి తంబుర అనే వాయిద్యమును తన చేతిలోనికి తీసుకొని యెహోవా ఇచ్చిన విజయమును ఉత్సాహంగా జరుపుకోంది. యెహోవా మోషేతో మిమ్మును బాదించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళునప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదవలెను అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకం వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడుదురు అని అన్నారు. శత్రువుల చేతి నుండి విడిపించుటకు కూడా ఆ సంగీత వాయిద్యం అయిన నేను ఉపయోగ పడ్డాను. యెహోషువ కాలంలో యాజకులు బూర ధ్వని అనే సంగీత వాయిద్యం ఊదినప్పుడు యెరికో పట్టణమే కూలిపోయింది. దానిని చూడగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. దావీదు సితార అనే సంగీత వాయిద్యం వాయించినప్పుడు సౌలు పైన ఉన్న అపవిత్రాత్మ తొలగిపోయింది. ఇంకా దావీదు నా ద్వారా అద్భుతమైన కీర్తనలు పాడాడు. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆర్భాటముతోను సంగీత వాయిద్యం అయిన బూర ధ్వనితోను మధ్య ఆకాశమునకు దిగి వస్తాడు అనే వార్తను వినినప్పుడు నేను చాలా సతోషించాను. 

 

ప్రభువు నందు ప్రియమైన వారలారా! సంగీత వాయిద్యం అయిన నా వలె మిమ్మును మీరు దేవుని చేతికి ఒక సంగీత వాయిద్యం వలె అప్పగించు కొంటారా? మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమస్త క్రియలు అన్నింటిలో మనకు విజయం ఇచ్చిన దేవున్ని మిర్యాము వలె స్తుతిస్తారా లేదా శత్రువు కోటను కదిలించడానికి భయపడతారా?. ఈ లోకంలో సాతాను వలన కట్టబడి ఉన్న వారిని విడిపించుటకు బందింపబడి ఉన్నవారికి సువార్త ప్రకటించుటకు అభిషేకం పొందుకొనుటకు మీద్వారా విడుదల అనే నినాదం వినిపిస్తుందా? అలా వున్నప్పుడు అంత్యకాల బూర ధ్వని మ్రోగినప్పుడు ఒక్క క్షణంలో పునరుద్దానం చెంది ఆయనతో కూడా కలిసి ఉంటాం. హల్లెలుయా!

- సిస్టర్. ఏ. బ్యూలా.

 

ప్రార్థన అంశం:-

యూట్యూబ్ మరియు ఫేస్ బుక్ ద్వారా 8 బాషలలో పంపబడుతున్న మన దిన ధ్యానం ఆటంకం లేకుండా ప్రజల యొద్దకు చేరేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet holiganbet giriş casibom giriş bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino