Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.07.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 20-Jul-2022

దిన ధ్యానము(Telugu) 21.07.2022

 

అంశం:- సోమరి.

 

"సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును" - సామెతలు 21:25

 

లోక ప్రసిద్ధి గాంచిన జ్ఞాని లియో డాల్ స్టైన్ జీవించిన కాలంలో ఒక సోమరి ఉండేవాడు. అతడు లియో డాల్ స్టైన్ ను కలవడానికి వచ్చి అయ్యా నా తండ్రికి కాళ్ళు లేవు కాబట్టి నాకు ఒక సహాయం చెయ్యండి అని అడిగాడు. ఆ యవ్వనుడిని చూసి అత్యవసర సహాయం కావలెనా లేదా శాశ్వత సహాయం కావలెనా అని అడిగారు లియో. అతడు సంతోషంగా శాశ్వత సహాయం అడుగుదామని అయ్యా దయచేసి శాశ్వతమైన సహాయం చెయ్యండి అని అన్నాడు. అప్పుడు నీ కుడిచేతిని నరికి నాకు ఇవ్వు నేను 500 రూపాయలు ఇస్తాను అన్నాడు లియో. ఆ సోమరికి చాలా కోపం వచ్చింది. నా చేతి వెల కేవలం 500 రూపాయలేనా అని అన్నాడు. అయితే సరే నీ కుడి కన్ను తీసి నాకు ఇవ్వు 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు. మరొకసారి ఆ సోమరి కోపంతో రగిలిపోయాడు. అప్పుడు అతనికి లియో డాల్ స్టైన్ వివరించడం మొదలు పెట్టాడు. నీ విలువైన శరీరంతో పనిచేయడం ప్రారంభించు అని స్పష్టంగా అర్థం అయ్యేలా వివరించారు. వెంటనే ఆ యవ్వనుడి యొక్క కన్నులు తెరవబడ్డాయి. తన శరీరంలో ఎంతో బలం ఉన్న ఆయన దానిని ఉపయోగించకుండా ఉన్న దానిని గమనించి సిగ్గుపడ్డాడు ఆ సోమరి. ఆరోజు నుండి తన సోమరి తనాన్ని విడిచిపెట్టి చురుకు తనం కలిగిన యవ్వనుడిలా జీవించడం ప్రారంభించాడు. లోక ప్రసిద్ధి గాంచిన స్వరాలు వ్రాసిన లియో డాల్ స్టైన్ మూలముగా ఒక సోమరిగా మారడం అనేది చాలా ప్రత్యేకంగా ఉన్నది.

 

క్రీస్తులో ప్రియమైన వరలారా! జ్ఞాని అయిన సొలోమోను ద్వారా అనేక మంది సోమరులకు బోధ అందించ బడుతుంది. సోమరి తనం అనేది ఒక మనుష్యుని జీవితంలో ఎంతటి దరిద్రమును, మురికితనం తీసుకొని వస్తుందో సామెతలు గ్రంధంలో చదువుతున్నాం. ఈరోజు చెయ్యవలసిన దానిని రేపటి దినాన్ని చేస్తాను అని త్రోసి వేయడం అనేది సోమరి తనం యొక్క ప్రధాన లక్షణం. ఏరోజు పని ఆరోజే, ఎప్పటిది అప్పుడే ఆయా సమయాల్లో క్రమముగా చెయ్యాలి అంటే సోమరితనానికి పని లేదు. సోమరి అయిన చెడ్డ దాసుడు చీకటిలో త్రోసి వేయబడును అని మత్తయి సువార్తలొ యేసుక్రీస్తు చెబుతున్నారు. మద్యం ఇంటికి మరియు దేశానికి హానికరం అని చెప్పిన విధముగా సోమరి కూడా ఇంటికి మరియు దేశానికి పెద్ద భారంగా ఉన్నాడు. ప్రార్ధించండి సోమరి తనం నుండి విడుదల పొందుకొనుటకు యేసుక్రీస్తు మీకు సహాయం చేస్తారు. ఆమెన్.

- బ్రదర్. పి. జాకబ్ శంకర్ గారు.

 

ప్రార్థన అంశం:-

ప్రతి నెల పత్రికలు ముద్రించుటకు మరియు వాటిని పంపించుటకు కావలసిన అవసరాలు తీర్చ బడేటట్లు ప్రార్దిద్దం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet giriş hepsibet hepsibet giriş betnano betnano giriş betparibu betparibu giriş casibom virüsbet pashagaming kalebet perabet pashagaming virusbet marsbahis imajbet perabet perabet giriş perabet perabet giriş