By Village Missionary Movement
Tuesday, 19-Jul-2022దిన ధ్యానము(Telugu) 20.07.2022
అంశం:- నిరీక్షణ ముగుస్తుంది.
"కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము" - సామెతలు 13:12
ఇరాన్ మరియు ఇరాక్ మధ్య జరిగిన యుద్ధం లో కొంతమందిని ఖైదీలుగా ఇరాక్ కు తీసుకొని వెళ్లబడ్డారు. అందులో ఒక నిండు గర్భిణీ గా ఉన్న ఒక యుద్ధయోధుని భార్య తన భర్త చెరసాల ఖైదీ వలె వెళ్ళుటను విని తన హృదయం పగిలిపోయింది. భర్త కోసం ఎదురుచూస్తూ ఏడుస్తున్న ఆమెకు. ప్రసవవేదన పడుతున్న ఆమెకు ఒక శిశువు జన్మించింది. తన బిడ్డకు ఎన్సీ లైటా అని పేరు పెట్టింది. దానికి నా నిరీక్షణ ముగుస్తుంది అని అర్ధం. తన బిడ్డను పిలుస్తున్న ప్రతీసారి తన భర్త కోసం ఎదురుచూస్తున్న నరీక్షణ వృధా కాదు అని త్వరగా తను వచ్చేస్తారు అని తనలో నమ్మకం పెరుగుటను తను గ్రహించింది. చాలా సంవత్సరాలు ఎదురు చూస్తున్నప్పుడు ఒక రోజు యుద్ధ ఖైదీలను విడుదల చేసి ఓడ మీద తీసుకు వస్తున్నారు అని వార్తను విని తల్లి, కుమార్తె పరిగెత్తుకొని వెళ్ళారు. భర్త ను చూసిన వెంటనే నా నిరీక్షణ ముగిసింది అని చెప్పి సంతోషించింది.
గాబ్రియేలు అనే దూత కన్యకయైన మరియ యొద్దకు వచ్చి మరియ భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పినప్పుడు మొదట కంగారుపడి ఇది ఎలాగు జరుగునని ఆమె తరువాత దేవునికి తనను సమర్పించుకొని చెప్పబడిన మాటను తనలో అంగీకరించుట వలన కలిగిన ఫలితం ఏమిటంటే మన యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చాడు. ఆ రోజుల్లో అనేకమంది కన్యకలు యేసుక్రీస్తు యొక్క జన్మముగూర్చి ప్రవక్తల ద్వారా విని తన గర్భములో యేసు పుట్టాలి అని ఆమె తో సహా ఎదురు చూసిన సమయంలో మరియకు మాత్రమే ఆ అవకాశం వచ్చుటలో అమె పూర్ణ మనస్సుతో ఆ వార్తను అంగీకరించి భాగ్యాన్ని పొందుకుంది. ఆమె ఎదురుచూపు వృదాకాలేదు. రక్షకుడు జన్మించాడు.
మన జీవితంలో కూడా అనేకసమయాలలో కొన్ని మేలుల కొరకు ఎదురుచూడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి చాలా రోజులుగా ప్రార్ధిస్తూ వాగ్ధానాలను పొందుకొని జవాబు రావడం ఆలస్యం మైనప్పుడు కృంగి అలసిపోయి. దేవుడు ఇచ్చిన వాగ్దానాలను మరచిపోతున్నాం. యెహోవా యొక్క మాట చెప్పున శారా మూలముగా సంతతి వచ్చుటకు శారా సులువైన మార్గములో ప్రయత్నం చేయు విధముగా మనం ఉండకూడదు. కోరిక సఫలం కాకుండు నిమిత్తము హృదయము నొచ్చును. సిద్ధించిన మనోవాంచ జీవ వృక్షము అనే వాక్యం మూలముగా ఏర్పరచిన మేలులు పొందుకునే అంతవరకు ప్రభువు మనకు ఏర్పరచిన వాక్యము హృదయములో ఉంచుకొని వాటిని పొందుకొనుటకు ప్రయత్నిద్దాం విజయాన్ని పొందుకుందాం. హల్లెలూయా !
- శ్రీమతి. వాసంతి రాజమోహన్
ప్రార్థన అంశం:-
పరిచర్య చేయుటకు ఆశించే వారికోసం భయలు పరుస్తున్న పత్రిక ద్వారా అనేక నూతన సేవకులు లేచులాగున ప్రార్ధిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250