By Village Missionary Movement
Monday, 18-Jul-2022దిన ధ్యానము(Telugu) 19.07.2022
అంశం:- సాటిలేని మహిమ.
"మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను" - రోమీయులకు 8:18
ఒక గ్రామంలో నీటి కొరత అధికంగా ఉండటం వలన అక్కడ ఉన్న ప్రజలు చాలా కష్టపడేవారు. వారందరు రెండు మైళ్ళు దూరం వెళ్ళి నీటిని తీసుకొని వచ్చేవారు. అప్పుడు. గ్రామంలో ఉన్న ఒక తండ్రి తన ఇద్దరు కుమారులతో మన తోట దగ్గర గొప్ప నిధి ఉన్నది అని చెప్పారు. పనికి వెళ్ళి వచ్చిన వెంటనే ఇద్దరు కుమారులు చాలా ప్రయత్నం చేసి త్రవ్వడం మొదలు పెట్టారు. కాని వారికి ఏ నిధి కూడా దొరకలేదు. తండ్రి ఆ నిధిని పొందుకోవాలి అంటే ఇంకా త్రవ్వాలి అని చెప్పి ప్రోత్సహించాడు. ఇద్దరూ కూడా రాళ్లను పగులగొడుతూ త్రవ్వారు. ఊరంతా వాళ్ళను చూసి హేళన చేసేవారు. వీరిద్దరూ మాత్రం వాళ్ళ మాటలను పట్టించుకోకుండా త్రవ్వుతూనే ఉన్నారు. ఒక రోజు అందులోనుండి నీటి ఊట వచ్చింది. వారు ఆ నీటిని త్రాగి చూసినప్పుడు అది స్వఛ్చమైనదిగా ఉన్నది. ఆ ఊట చాలా కాలం వరకు వారికి నీటిని మరియు సంతోషాన్ని ఇచ్చింది. వారు దానికొరకు పడిన కష్టం కూడా గుర్తు లేనంతగా సంతోషం వారికి కలిగింది. అపోస్తులుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 8:15-18 వచనాల్లో మనం చూసినట్లయితే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులము అని చెప్పి ఆ మహిమతో పోల్చినప్పుడు ఇప్పటి కాల శ్రమలు ఎన్నతగినవి కావు అని చెబుతున్నారు. పందెములో పరిగెత్తే వీరుడు బహుమతి కొరకు పరిగెత్తినట్లయితే ఆ పందెం యొక్క దూరం కొద్దిగా కనిపిస్తుంది. అదే విధంగా జయించిన వాడు అని బలపరిచిన ప్రత్యేకతలు సభకు చెప్పబడిన మహిమ శోధనలు జయించిన వారికి సొంతం అవుతుంది. అంత గొప్ప మహిమకు స్వతంత్రులుగా మారుటకు ఎంతటి కష్టమునైన పడవచ్చు అని మనకు అనిపిస్తుంది. మనం కృంగి నప్పుడు లేదా భరించలేని దుఃఖం కలిగినప్పుడు మనం గుర్తు చేసుకోవలసిన సత్య వాక్యములు సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింప లేదు. దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింప నంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనియ్యడు(1కోరిందీ 10:13). లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి యున్నాననెను (యోహాను 16:33). మనం ఆయన వలె శ్రమలను సహించిన యెడల ఆయన వలె మహిమను కూడ పొందుకుంటాం. దీనిని చదువుతున్న మీరు కుడా కొన్ని శ్రమల గుండా వెళ్తూ ఉండవచ్చు వాటిని సంతోషంతో అంగీకరించి లక్ష్యం వైపు చూస్తూ సహనంతో పరిగెత్తి ఆ నిత్య మహిమను సొంతం చేసుకొందాం. ఆ వాక్యమును మనస్సులో ఉంచుకొంటె అదే మనలను ఉత్సాహ పరుస్తుంది. శ్రమలను సహించుటకు మనలను బలపరుస్తుంది. ఆమెన్.
- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు
ప్రార్థన అంశం:-
ప్రార్థన కూట నాయకులు అనే పత్రిక ద్వారా 7000 ప్రార్థన కూటములు అభివృద్ధి చెందేలా మరియు దేశంలో ఉజ్జీవం కలిగేలా ప్రార్దిద్దం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250