Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.07.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Monday, 18-Jul-2022

దిన ధ్యానము(Telugu) 18.07.2022 (Youth Special)

 

అంశం:- కంచె వేసి కాపాడుకోనుము.

 

"నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము" - సామెతలు 4: 23

 

ఒక ఊరిలో ఇద్దరు వ్యవసాయ స్నేహితులు ఉండేవారు. ఆ స్నేహితులు ఒకసారి బంజరు భూమిలో టమాటా నారు నాటాలి అనుకొని మరుసటి రోజు ఆ భూమిలో విత్తనాలు వేశారు. నారు కొంచం పెరిగింది. మొదటి వ్యవసాయకుడు ఆ తోట చుట్టూ కంచె వేసాడు. ఎప్పటికప్పుడు ఆ టమాటా మొక్కల మధ్యలో ఉన్న కలుపు మొక్కలను తీసివేసేవాడు. రెండవ వ్యవసాయకుడు మాత్రం ఇతనికి పని పాట లేదు వీటికి కంచె అవసరమా నీరు పోస్తే చాలదా? అని ఎగతాలిగా మొదటి వ్యవసాయకునితో అన్నాడు. ఫలించే సమయంలో రెండు తోటలు కాయలు కాసాయి. ప్రతి రోజు సాయంత్రం ఇద్దరూ తోటను చూచుటకు వెళ్ళినప్పుడు రెండవ వ్యవసాయకుడు నేను కంచె వెయ్యలేదు కలుపు కూడా తియ్యలేదు కాని నా తోట చాలా బాగా కాసింది నువ్వు కంచె వేసి నీ డబ్బును కలుపు తీసి నీ సమయాన్ని వృధా చేసావు అని ఎగతాళి చేసేవాడు. టమాటాలు అన్నీ చాలా చక్కగా పండాయి. మరుసటి రోజు వేకువ జామునే తోటకు వచ్చారు కంచె లేని తోటలో టమాటాలు అన్నీ ఏరి తోట అంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రియమైన యవ్వనులారా మీ హృదయం లో నుండి జీవ దారలు బయలు దేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు కొనుము అని పరిశుద్ధ గ్రంధం సెలవిస్తుంది. మరి మన హృదయము కాపాడుకొనుట ఎలా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు మనస్సులో ఉంచుకుని శోధనలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఉపయోగించు కొని మనస్సును కాపాడు కోవాలి. మనం దేవునికి భయపడి చెడుతనమును విడిచి పెట్టిన వారి వలె ప్రభువైన యేసుక్రీస్తు ని ప్రేమించే వారి వలె ఉన్నప్పుడు మనలను ఎగతాళి చేసేవారు అనేకులు ఉంటారు అలా ఎగతాళి చేసేవారి జీవితం బాహ్యంగా చూస్తే చాలా మంచిగా ఉన్నట్లే కనిపిస్తుంది. కాని అది కంచె లేని జీవితం.

 

పరిశుద్ధ గ్రంధంలో యోసేపు మరియు సమ్సోను అనే ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. ఇందులో యోసేపు తన పరిశుద్ధతను దేవుని యందలి గల భయంతో కంచె వేసుకొని కాపాడుకొన్నాడు. అతను దేవుని దృష్టి యందు మాత్రమే కాక మనుష్యుల ముందు కూడా హెచ్చింపబడ్డాడు. కాని సమ్సోను తన పరిశుద్ధతకు కంచె వేయడం మర్చిపోవడం వలన ఇతరుల ముందు తమాషాగా మారిపోయాడు. మనం ఈ లోకంలో మారు వేషం ధరించుకొని జీవిస్తునప్పుడు చాలా ఆశీర్వాదకరమైన జీవితంలా ఉన్నప్పటికీ చివరికి అది నాశనమునకే తీసుకొని వెళ్తుంది. ఆ టమాటా తోట వలె మనకు కూడా ఫలించే కాలం ఉంది. మనం మన హృదయమును దేవుని వాక్యముతో కంచె వేసి నడుచుకొన్నప్పుడు మాత్రమే ఆ జీవితం సంతోషకరముగా ఉంటుంది. లేకపోతే చివరికి నాశనం తప్పదు. కాబట్టి ఇతరులు మాట్లాడే ఎగతాళి మాటలు త్రోసివేసి మీ ఆశీర్వదకరమైన జీవితమును కంచె వేసి కాపాడుకొని మంచి ఫలాలు ఇచ్చే వృక్షాల వలె జీవించండి.

- బ్రదర్. సి. పాల్ జబస్టీన్ రాజ్ గారు.

 

ప్రార్థన అంశం:-

ప్రత్యేకంగా యవ్వన పిల్లలకు "యవ్వనురాలా విను" అనే పత్రిక ద్వారా అందజేయబడుతున్న సలహాలను పొందుకొని ఆత్మీయ జీవితంలో ఎదిగేలా ప్రార్దిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet giriş hepsibet hepsibet giriş betnano betnano giriş betparibu betparibu giriş casibom virüsbet pashagaming kalebet perabet pashagaming virusbet marsbahis imajbet perabet perabet giriş perabet perabet giriş