Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.07.2022
Share:

By Village Missionary Movement

Sunday, 17-Jul-2022

దిన ధ్యానము(Telugu) 17.07.2022

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” - యోహాను 3:16

 

అంశం:- జెర్రి యొక్క సంతోషం.

 

హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? రకరకాల బొమ్మలతో మరియు మీ ఫ్రెండ్స్ తో కలిసి ఆటలాడుకొంటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా? ఈరోజు జెర్రి అనే తమ్ముడు సంతోషంగా ఉండడం అనేది ఎలా నేర్చుకొన్నాడో తెలుసుకొందమా? జెర్రిని సెల్సీ వాళ్ళ ఇంట్లో వదిలేసి వాళ్ళ అమ్మ నాన్న ఒక చోటకు వెళ్లారు. జెర్రి సెల్సీ తో కలిసి చాలా రకాల బొమ్మలతో చక్కగా అడుకొంటున్నాడు. అమ్మ జెర్రిని తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు అప్పటి వరకు ఆడుకున్న ఆ టెడ్డిబెర్, కారు కూడా నాకు కావాలి అని పట్టుబట్టాడు. జెర్రీ వాళ్ళ అమ్మ తనను వాటిని మర్చిపోయేలా చేద్దాం అని జెర్రీ మనం వాకింగ్ కు వెళ్లి వీటిని కొనుకొందాం అని చెప్పింది. వెంటనే వాటిని వదిలేసి అమ్మ నాన్నలతో సంతోషంగా కలిసి వాకింగ్ కు వెళ్ళాడు జెర్రీ. వారు వెళ్లే స్థలంలో ఇల్లులు చాలా చిన్నవిగా ఉన్నాయి. అక్కడ ఉన్న పిల్లలు పగిలిన బొమ్మలతో మరియు బాల్స్ తో , పాత సైకిల్స్ తో అడుకొంటున్నారు. ఏడుస్తున్న ఒక చిన్న పాపతో నాదగ్గర ఉన్న ఏరోప్లైన్ తో అడుకొందాం వస్తావా అని చెప్పి ఒక తమ్ముడు తన దగ్గర చక్రం ఉడిపోయిన ఏరోప్లైన్ బొమ్మను ఇచ్చుట చూసిన జెర్రీ కి చాలా ఆశ్చర్యం కలిగింది. వెంటనే జెర్రీ అమ్మతో ఇకపై నేను ఇతరుల వస్తువులపై ఆశ పెట్టుకొను అమ్మ ఈ పిల్లలు వారి యొద్ద ఉన్న వస్తువులతో సంతోషంగా అడుకొంటున్నారు. నేను కూడా నా దగ్గర ఉన్న బొమ్మలను తీసుకొని సెలవు రోజుల్లో ఇక్కడికి వచ్చి వీరికి ఇస్తాను అని చెప్పాడు జెర్రీ.

 

 ఏంటి పిల్లలు మీరు కూడా ఇతరుల యొద్ద ఉన్న వస్తువుల పైన ఆశ పడుతున్నారు కదా. మీ యొద్ద ఉన్న బొమ్మలు ఇతరులకు ఇచ్చి వారితో అడుకొంటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. యేసయ్య కూడా మనం సంతోషంగా ఉండాలి అని తననే మన కొరకు అప్పగించు కొన్నారు కదా. సరే పిల్లలు యేసయ్య మనలను చాలా ఎక్కువగా ప్రేమించుట వలన మనం సంతోషంగా ఉండాలి అని ఆయన మన కొరకు ప్రాణాన్నే అర్పించారు. 

పిల్లలు ఇప్పుడు మనం ఒక కంఠత వాక్యం నేర్చుకొందమా? 

 

 

 

సిస్టర్. ఐడా.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al