By Village Missionary Movement
Saturday, 16-Jul-2022దిన ధ్యానము(Telugu) 16.07.2022
అంశం:- ఎలా చూడాలి.
"మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును" - 1 సమూయేలు 16:7
ఒక చెప్పుల దుకాణం యొక్క యజమాని తన దుకాణం యొక్క తదుపరి శాఖను తన నిర్దిష్ట ద్విపములో ప్రారంభించాలి అని అనుకున్నాడు. అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించడానికి ఇద్దరి పనివాళ్లను పంపించాడు. వారు ఆ ధివికి వెళ్లి అక్కడ ఉన్న అందరితో మాట్లాడి తిరిగి యజమాని యొద్దకు వెళ్లారు. మొదటి వాడు అయ్యా ఈ వీదిలో ఉన్న వారికి చెప్పులు వేసుకొనే అలవాటే లేదు అక్కడ మనం దుకాణం పెడితే వ్యాపారం జరగదు అని అన్నాడు. రెండవ పనివాడు అయ్యా ఆ దీవిలో ఉన్న వారికి చెప్పుల గురించి ఏమి తెలియదు కాబట్టి మనం వారికి చెప్పుల యొక్క ఉపయోగం మరియు వాటి యొక్క ప్రాముఖ్యత వారికి చెప్పినట్లయితే వ్యాపారం మనం చాలా బాగా చెయ్యవచ్చు. అవును పరిస్థితులు ఒక్కటే కాని ఇద్దరి దృష్టి మరియు ఆలోచన వేరు వేరుగా ఉన్నాయి.
ప్రియమైన వారలారా! ఇదేవిధంగా యెహోషువా కాలంలో యెహోషువా మరియు కాలేబు కలిసి కానాను దేశమునకు వేగుచూచుటకు వెళ్ళినప్పుడు యెహోషువా మరియు కాలేబు యొక్క ఆలోచన మరియు వారితో ఉన్న వారి యొక్క ఆలోచన వేరువేరుగా ఉండేవి. పరిస్థితి ఒక్కటే కాని దృష్టి వేరు అదికాండం 39 వ అధ్యాయంలో యోసేపు గురించి చదువుతున్నాం. ఫోతిఫర్ యెహోవా యోసేపుకు తోడై యున్నాడు అని చూసాడు. ఫోతిఫర్ భార్య మాత్రం యోసేపు యొక్క పై రూపమును అతని యొక్క అందమును చూసింది. ఈనాడు మన యొక్క చూపు ఎలా ఉంది. మనం ఒకరిని చూసినప్పుడు వారి యొక్క ప్రదర్శనను బట్టి గౌరవిస్తున్నామా? ఆలోచించి చూద్దాం. అదేసమయంలో మనలను చూసే వారికి మన యొక్క బాహ్య సౌందర్యం మన యొక్క విద్య, అర్హత ఆస్తి అంతస్తులను చూసే విధముగా ప్రవర్తిస్తున్నమా? లేదా యేసుని ప్రతిబింబిస్తున్నామా? ఇంకా మనం ఉండే పరిస్థితులు ఎటువంటి దృష్టితో చూస్తున్నాం. ఇకపై ఏం చెయ్యలేము అనా లేదా అంతా ముగిసింది అనా. మన యొక్క ప్రయత్నం అంతా వృధా అనే అవిశ్వాసముతో మాట్లాడుతున్నమా? లేదా విశ్వాసముతో పరిస్థితులను ఎదుర్కొంటున్నామా? పరిస్థితులు ఎలా వున్నా మనలను బలపరచు క్రీస్తు నిమ్మితము సమస్తమును మనం చేయగలం. మనకు జయం ఇచ్చు దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి కృంగిపోకుండా, అలసిపోకుండా మీ కొరకు నియమింపబడిన పనిని మొదలు పెట్టండి. దేవుడు మీకు తోడుగా ఉండును గాక! ఆమెన్.
- సిస్టర్. ఐడా గారు
ప్రార్థన అంశం:-
తమిళనాడులో ప్రతి శనివారం జరుగుతున్న ఉజ్జీవ కూటములు పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ దేవుడు విశేష అభిషేకముతో నింపేలా ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250