By Village Missionary Movement
Wednesday, 13-Jul-2022దిన ధ్యానము(Telugu) 14.07.2022
అంశం:- అబద్దమాడు పెదవులు.
"అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు" - సామెతలు 12:22
నేను మా ఇంటినుండి దుకాణమునకు వెళ్తున్నప్పుడు ఆ దారిలో చాలా అసహ్యమైన దుర్వాసన వచ్చింది. కాని నేను దానిని దాటకుండా దుకాణమునకు వెళ్లలేను. ఏదో ఒక విధముగా ఆ స్థలాన్ని దాటి వెళ్ళిపోయాను. మరల తిరిగి వస్తుండగా పైన చెప్పబడిన వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది మనం కూడా చెడు మాటలను మాట్లాడినప్పుడు దేవుడు మనలను అసహ్యంగా చూస్తాడు. అబద్దం మనకు అంత పెద్ద పాపం వలె కనిపించట్లేదు. ఇతరుల యొక్క నమ్మకం నేను పొందుకోవాలి నేను చేసిన పనికి లోటుపాట్లు ఎవరు చెప్పకూడదు అని సర్వ సాధారణంగా అబద్దలు మాట్లాడుతు ఉంటాం. వీటన్నింటి దేవుడు గమనిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవడం లేదు. నేను దేవునికి బయపడి నడుచుకోవాలి, ఆయనను సంతోష పరచాలి అనే ప్రేరేపణ మనకు ఉన్నట్లయితే ఇటువంటి అబద్దపు మాటలు మనం మాట్లాడము. అబద్దాలు మాట్లాడితే వచ్చే నష్టాల గురించి పరిశుద్ధ గ్రంధం ఏమి సెలవిస్తుందో చూద్దాం.
• అబద్ధము అడువారి నోరు మూయబడును. (కీర్తనలు 63:11).
• కూటసాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములు అడువారు తప్పించుకొనడు (సామెతలు 19:5).
• అబద్ధములు అడువారు నశించును (సామెతలు19:9).
• అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకొందురు (సామెతలు 21:6).
• వారు పలుకు శాపములనుబట్టియు అబద్ధములనుబట్టియు వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక (కీర్తనలు 59: 12)
• గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక. (కీర్తనలు 119: 78).
• కూటసాక్షి మోసపు మాటలు చెప్పును. (సామెతలు 12: 17)
• కల్లలాడు నాలుక యెహోవాకు హేయము (సామెతలు 6: 17)
• కూటసాక్షి నశించును (సామెతలు 21: 28)
అవును అబద్ధములాడువారిని గురించి ఇంకా చాలా విషయాలు పరిశుద్ధ గ్రంధంలో కలవు. ధైర్యముగా పేతురుకు అబద్ధము చెప్పిన అననీయా మరియు సప్పీరా యొక్క ముగింపు ఎరిగియున్నాం. ధైర్యముగా అబద్ధము అడకుండా మన పెదవులను మరియు ఆత్మను కాపాడుకొందుము గాక! ఆమెన్.
- సిస్టర్. బేబీ కామరాజ్ గారు
ప్రార్థన అంశం:-
దేవుడు మనకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చుటకు ప్రతి రాష్ట్రము నుండి 12 మంది మిషనరీలు లేపబడేటట్లు ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250