Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.07.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 12-Jul-2022

దిన ధ్యానము(Telugu) 13.07.2022

 

అంశం:- సహాయం కావలెనా.

 

"తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు" - హెబ్రీయులకు 2:18

 

సమీపంలో రేచల్ అనే ఒక అమ్మాయికి వివాహం జరిగింది. తన కుమార్తెను చూడటానికి తన తండ్రి వెళ్ళినప్పుడు కూతురు అల్లుడు ప్రేమతో ఆహ్వానించారు. రేచల్ నీకు ఇష్టమైన చేపలను కొనితెచ్చాను త్వరగా వంట చెయ్యు భోజనం చేద్దాం అని తండ్రి చెప్పాడు. నాన్న మీ అల్లుడుకు చేపలు నచ్చవు అందువలన ఇప్పుడు చేపలు వండటమే మానేశాను అని రేచల్ చెప్పినప్పుడు నాన్న చాలా సంతోషించాడు. ఎందుకు అనగా వివాహ జీవితంలో ఒకరికి ఇష్టమైన దానిని ఇంకొకరు అర్ధం చేసుకొన్నప్పుడే జీవితంలో విజయం సాదించగలం. మనం ఈ లోకంలో యేసుక్రీస్తుకు ప్రియముగా జీవించుటకు పిలువబడి ఉన్నాము. మనం చేసే ఈ క్రియలు ప్రభువునకు ప్రియమైనవా? వీటిని ఆయన అంగీకరిస్తారా? అని ఆయన చిత్తాన్ని ఎరిగి జీవించినప్పుడు మనం కూడా పాపము నుండి తొలగి విజయవంతమైన జీవితమును జీవించగలము. దేవుని చిత్తము నుండి తొలగి పోవుటయే పాపము. మొదటి ఆదాము ఆ విధముగానే తొలగి పాపము చేసాడు. కాని రెండవ ఆదాము అయిన యేసుక్రీస్తు మన వలె రక్త మాంసములతో ఒక మనుష్యునిగా ఈ లోకములోనికి వచ్చారు. ఆయన యొక్క దైవత్వమునకు మరియు మనుష్యత్వమునకు ఉన్న సంబంధం మనకు తెలియదు. కాని దైవత్వమునకు శోధన లేదు పాపము లేదు అందువలనే యేసుక్రీస్తు పూర్తిగా మనుష్యునిగా శోధింప బడ్డారు. కాని పరిశుద్ధునిగా ఎలా జీవించారు? 

 

ప్రియమైన వరాలరా! యేసుక్రీస్తు తండ్రికి ప్రియమైన వాటిని చేయడం వలన తండ్రితో గల ఐక్యతతో మరియు దేవుని ఆత్మ బలముతో ప్రోత్సాహకరమైన ప్రార్ధనతో శోధన జయించారు. పాపమునకు నో చెప్పలేని మనకు సహాయం చేయుటకు చేతిని అందించారు. ఎందుకనగా ఈ పాపపు లోకములో ఆయన జీవించినప్పుడు సాతాను ద్వారా శత్రువుల ద్వారా సహజమైన ప్రజల ద్వారా శిష్యుల ద్వారా హింసింపబడి, శోధింపబడి పాపము చేయక పోవడం వలన శోధింప బడుతున్న మనకోరకు ఆయన పరితపిస్తున్నారు మరియు సహాయం చేస్తున్నారు. అందువలన యేసుక్రీస్తు యొక్క చిత్తమునే మన చిత్తముగా మార్చుకొందాం. ఆయననే పట్టుకొని ఆయననే నమ్ముకుని ఉన్నప్పుడు ఆయనే మనకు సమస్త క్రియలలో సహాయం చేస్తారు. హల్లెలుయా!

- సిస్టర్. ఏ. బ్యూల గారు

 

ప్రార్థన అంశం:-

7000 మంది మిషనరీల ద్వారా ఒక లక్ష గ్రామాలను సందించుటకు తీసుకొంటున్న ప్రయాసలో దేవుని హస్తం తోడై యుండు లాగున ప్రార్దిద్దం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet