Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.07.2022
Share:

By Village Missionary Movement

Saturday, 09-Jul-2022

దిన ధ్యానము(Telugu) 09.07.2022

 

అంశం:- నన్ను కరిగిస్తే.

 

"మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు" - మత్తయి 5:14

 

ఒక జయమానుని ఇంటి వద్ద చాలా కొవ్వొత్తులు ఉన్నాయి. అవి అన్నీ అందమైన రంగులతో వివిధ రూపాలతో వివిధ పరిమానాలలో ఉన్నాయి. వీటిలో ఒకే ఒక కొవ్వొత్తి మాత్రం చాలా చిన్నదిగాను అలంకరణ లేకుండా సాధారణ రంగును కలిగి ఉన్నది. ఇది మిగతా కొవ్వొత్తులను చూసి నేను వాటి వలె అందంగా పెద్ద పరిమాణంలో లేకుండా అందహీనముగా తయారు చేయబడ్డాను. నన్ను మాత్రమే ఎందుకు ఇలా తయారు చేశారు నన్ను ఎవరు ఇష్టపడతారు అని బాధ పడుతూ ఉన్నది. ఒకరోజు రాత్రి కొవ్వొత్తులు అన్నీ ఆరిపోవడంతో ఆ ఇంటి యజమానుడు చేతిలో అగ్గిపెట్టి తీసుకొని వచ్చి కొవ్వొత్తులు ఉన్న గదిలోనికి వెళ్ళాడు. ఆ గదిలో ఉన్న కొవ్వొత్తులు అన్నీ ఈరోజు యజమానుడు ఎవరిని వెలిగిస్తాడో అని వేచిచూస్తున్నాయి. యజమాని ఆ సాధారణమైన కొవ్వొత్తుని తీసుకొని వెలిగించి దానిని గది మధ్యలో పెట్టాడు. చీకటితో నిండియున్న ఆ గది చాలా ప్రకాశవంతముగా మారడం చూసి ఆ కొవ్వొత్తి చాలా సంతోషించింది. అప్పుడే ఆ సాదారణమైన కొవ్వొత్తికి ఒక నిజం అర్థం అయ్యింది. నేను తయారు చేయబడుటకు కారణం వెలిగి, కరిగి, ప్రకాశించి చీకటిని తొలగించుటకే కాబట్టి దీని కొరకు అందమైన రంగు మరియు పెద్ద పరిమాణం అవసరం లేదు. నాతో పాటు వివిధ రంగుల్లో ఉన్న మరియు అనేక పరిమాణంలో ఉన్న అన్నీ కూడా ఒకరోజు కరిగిపోవాల్సిందే. నేను వెలిగి చీకటిని తొలగిస్తాను అనునదే నా యజమానుని యొక్క నిరీక్షణ. ఆయన కోరికను ఈ రోజు నెరవేర్చి చీకటిని తొలగించి ఉపయోగపడ్డాను అని చాలా ఆనందం పొందుకొని ప్రకాశిస్తూ కరిగిపోయింది.

 

మత్తాయి సువార్త 7:21లో ఈవిధంగా వ్రాయబడి ఉన్నది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అని. మనం ప్రతిఒక్కరం మనకు లోకపు ఐశ్వర్యం లేదా సౌందర్యము ఉన్నదో లేదో, డిగ్రీలను సంపాదించామో లేదో వీటన్నింటి కోసం మనం బాధ పడాల్సిన అవసరం లేదు. అన్నీ ఉన్నను కరిగి ప్రకాశించ లేని కొవ్వొత్తుల వలె ఉండక సాధారణముగా ఉండి కరిగి ప్రకాశించే కొవ్వొత్తి వలె మనలను సృజించిన వాని ప్రణాలికను నెరవేర్చి జీవిద్దాం.

- శ్రీమతి. జబకని శేఖర్ గారు

 

ప్రార్థన అంశం:-

ప్రతి శనివారం తమిళనాడులో జరుగుతున్న ఉజ్జీవ కూటములు దేవుని మహిమర్దమై జరుగులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet