Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.07.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 06-Jul-2022

దిన ధ్యానము(Telugu) 07.07.2022

 

అంశం:- సమాధానం.

 

"నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు" - యెషయా 32:17

 

హెచ్.పి. మక్కటిని అనే బోధకుడు హాట్సాన్ టైలర్ ను చైనాలో కలిసినప్పుడు అతను చాలా రకాల భారాల మధ్యలో నెమ్మదిగా ఉండుట చూసి ఆశ్చర్యపోయాడు. మీరు లక్షలమంది ప్రజలతో కమ్యూనికేషన్ లో పాల్గొంటున్నారు నేను కొంత మందికి మాత్రమే సేవ చేస్తున్నాను. మీ పత్రికలు చాలా ప్రాముఖ్యమైనవి నా పత్రికలు వాటితో పోల్చే అంత గొప్పవి కావు. కాని నేను కలతతో చాలా కృంగిపోతున్నాను కాని మీరు నెమ్మదిగా నిశ్శబ్దంగా ఉన్నారు. ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. హాట్సాన్ టైలర్ బదులుగా నా మనస్సులో ఆలోచనలలో సమాధానం నిండి ఉండకపోతే నేను ఈ పనులను చేయలేను అని చెప్పాడు. ఆయన ఎల్లప్పుడు దేవునితో ఉండెను ఇది యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడిన నిజమైన నిలకడ అని మక్కటిని వ్రాశాడు. 

 

క్రీస్తు నందు ప్రియమైన వారలారా! యెషయా ప్రవక్త ద్వారా నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థలమునందును సుఖ కరమైన నివాసములయందును నివసించెదను అని చదువుతున్నాం. ఇంకా యెషయా గ్రంధం 26:3 లో ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగ కాపాడుదువు అని కూడా మనం చదువుతున్నాం. దేవుని ప్రజలకు సమాధానం అనేది మనం ఆనుకొని ఉన్న స్థలాల బట్టి కాదు బదులుగా ఒకడు క్రీస్తుతో కలిగి ఉన్న సంబంధం వలననే కలుగుతుంది. సమాధానము గూర్చి పరిశుద్ధ గ్రంధంలో అనేక వాక్యాలలో పరిశుద్దాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవునితో మనం ఉన్నాం అనేది దేనిని బట్టి మనం గ్రహించగలం. మీరు కృంగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు కృతజ్ఞత కలిగిన ప్రార్ధనలో ప్రభువును వెతికినప్పుడు అన్నింటినీ మించిన దేవుని సమాధానం మన ఆలోచనలను, హృదయాలను క్రీస్తులో మనలను కాపాడుతుంది. దావీదు కీర్తనలో చెబుతున్నప్పుడు నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రోటిల్లుటకు కారణం ఏమియు లేదు అని చెప్తున్నాడు. సమాధానం కలిగి జీవించాలి అని ఆశించేవారు సమాధానం వెతుకుతూ ఎక్కడికి వెళ్ళ వలసిన అవసరం లేదు ఎందుకు అంటే అది క్రీస్తులోనే దొరుకును. మీరు నెమ్మదిగా జీవించాలి అంటే యేసుని వెతుకుతూ రండి లోకం ఇవ్వలేని నిజమైన సమాధానమును మీరు పొందుకొన గలరు. ఆమెన్.

- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు.

 

ప్రార్థన అంశం:-

లోకాన్ని కదిలించే 120 మిషనరీలను దేవుడు మనతో ఐక్య పరుచులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet