By Village Missionary Movement
Wednesday, 06-Jul-2022దిన ధ్యానము(Telugu) 06.07.2022
అంశం:- తేలికైన భారం.
"ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును" - మత్తయి 11:28
అప్పుల సమస్య, నగదు సంక్షోభం, ప్రేమ వైఫల్యం, చదువులో అపజయం, ఒక మాటను కూడా సహించలేక పోవడం, బంధువుల వలన కలిగే చేదు అనుభవం ఇలా ఇంకా చాలా కారణాల వలన మనుష్యులు ఆత్మహత్య చేసుకొంటున్నారు. మన దేశం ప్రతిదానికి ఆత్మహత్య చేసుకొనుటకు దిగజారి పోయింది అనే భయం ఏర్పడుతుంది. అందులో ఎక్కువ వేదన ఏమనగా కుటుంబమును మరియు యవ్వన తరమును నడిపించవలసిన అమ్మ స్థానంలో నాన్న స్థానంలో ఉన్న వారుకుడా చిన్న పిల్లలతో కలిసి చనిపోతున్నారు. బ్రతక వలసిన వారు చిన్న వయస్సు లొనే మరణిస్తున్నారు. ఇటువంటి వార్తలను వింటున్న, చూస్తున్న ఇతర చిన్న పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే బాధగా ఉంది. ఆత్మ హత్య చేసుకొనేవారిలో చాలా మంది ఆత్మహత్య చేసుకోవడం ఎలా అని ఆలోచించే వారిలా ఉన్నారు. మనుష్యుని జీవితం యొక్క అర్థం, లక్ష్యమును మరచి జీవిత బారమును మోయ లేక అనేకులు జీవితమును నాశనం చేసుకొంటున్నారు.
పరిశుద్ధ గ్రంధంలో ప్రభువైన యేసుక్రీస్తు జీవించాల్సిన విధమును బోధిస్తున్నారు. మత్తయి సువార్త 11: 28-30వచనాల్లో భారము మోయుచున్న వారిని ఆయన యొద్దకు పిలిచి నా యొద్దకు రండి నా యొద్ద నేర్చుకొనండి అని మాట్లాడుతున్నారు.
ప్రియమైన వరలారా! ఆయన మాత్రమే మన జీవిత బారాలను మరియు బాధలను మార్చగలరు. ఆయన ఒక్కరు మాత్రమే నా భారమును తేలికగా ఉన్నది అంటున్నారు. యేసుక్రీస్తు మనుష్యుల కొరకు శ్రమలను అనుభవించి సిలువలో రక్తం కార్చి మరణించి మూడవ దినమున పునరుద్దానము చెంది తిరిగి లేచారు. ఆయన పడిన శ్రమలను మనము గుర్తుచేసుకొంటూ ఆయన యందు నమ్మకం ఉంచుటకు పరిశుద్ధ గ్రంధం మనలను పిలుస్తుంది.
స్నేహితులారా! జీవితం అనేది జీవించుటకే మధ్యలో మరణించుటకు కాదు. మనకు ఎదురయ్యే సమస్యలను చూసి కృంగిపోయి తప్పుడు తీర్మాణము తీసుకొనకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు పడిన శ్రమలను మనం గుర్తు చేసుకొంటే నిశ్చయముగా మన జీవిత భారం తేలికగా మారుతుంది. మీరు వేటిని భారం అనుకొంటున్నారో వాటన్నింటిని దేవునికి చెప్పి ఆయన వాక్యాన్ని ధ్యానించుటను పూర్తి శ్వాసగా మార్చుకోండి. ఇది ఒక అత్యవసర లోకం అని అంటారు కాని జీవితం అత్యవసరం కాదు. నిధానముగానే జీవించాలి మీ భారము తేలికైనదని గ్రహించండి దాని నుండి బయటకు రాగలం అని నమ్మండి. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది.
- బ్రదర్. టి. శంకర్ రాజ్ గారు
ప్రార్థన అంశం:-
మిషనరీల యొక్క సమస్యలలో దేవుని సంరక్షణ దయ చేయులాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250