Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.07.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Monday, 04-Jul-2022

దిన ధ్యానము(Telugu) 04.07.2022 (Youth Special)

 

అంశం:- చింతలను విచారించు వాడు.

 

"ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు(లక్ష్యముచేయుచున్నాడు) గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి" - 1పేతురు 5:7

 

ప్రతి దినం మనం వార్తా పత్రికలను చదువుతుంటాం. చాలా మంది ఆత్మహత్య చేసుకుని మరణించుట మనం చూస్తున్నాం. విద్యార్థులు వారి యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుకోలేదని ఆత్మహత్య చేసుకొని వారి యొక్క ప్రాణాన్ని కోల్పోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది దీనిని ఎలా నియంత్రణ చెయ్యగలo? ఈ లోకపు జీవితం యొక్క గొప్ప తనం ఎరుగని వారే వారి యొక్క ఆత్మను నష్టపరుచు కొని నరకానికి దిగిపోతున్నారు. కష్టం , నష్టం వచ్చినప్పుడు వారిని ఉత్సాహ పరిచి ఓదార్పు నిచ్చేటటువంటి మాటలను మాట్లాడినా సరే జీవితంలో వారిని పైకి ఏత్తుటకు ఒక్కరు ఉంటే అటువంటి పరిస్థితులు వారికి రావు. మనలను చక్కగా గమనించే ఒకరు ఉన్నారు అని వారు ఎరిగి ఉంటే అలాంటి ఆత్మహత్య అనే నిర్ణయం ఎవరు తీసుకోరు. ఆత్మహత్య చేసుకోవాలి అనే మనస్సు గల వారికి ప్రభువైన యేసుని పరిచయం చేయుటకు ప్రజలు లేరు. అందువలననే వారు చనిపోతున్నారు. ఇకపైన అయిన గాని ఈ తప్పుడు నిర్ణయం ఎవరు తీసుకొనకుండా మన రక్షకుడైన యేసుక్రీస్తుని వారికి పరిచయం చేద్దాం. అది మనపైన ఉన్న బాధ్యత. 

 

నా జీవితంలో నేను పాఠశాల చదివే రోజుల్లో రెండు గోల్డ్ మెడల్స్ పొందుకొనుటకు దేవుడు నాకు సహాయం చేశాడు. కాని పై చదువుల్లో చదవలేక అపజయం పొందుతానేమో అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. అపజయాన్ని ఎరుగని నేను దానిని ఎదుర్కోనుటకు భయపడ్డాను. అపజయం కలిగితే దాని వలన కలిగే నిందలను గూర్చిన భయం చాలా ఉండేది. ఈ భయం నన్ను మరణమునకు ప్రోత్సహించింది. అటువంటి పరిస్థితుల్లో నేను యేసుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. అపజయాన్ని, నిందలను సహించే మనస్సు ఆయన నాకు దయచేశారు. అపజయాన్ని నా జీవితంలో ఒక అనుభవ పాఠమును అంగీకరించేలా చేశారు. నేను మరలా పాస్ అయ్యి ప్రభువైన యేసును సంపూర్ణంగా హత్తుకున్నాను. నా కలలు, ఆశలు ముగిసిపోలేదు. దేవుడు నన్ను హెచ్చించి బ్యాంక్ లో ఆఫీసర్ పదవిని దయ చేశారు. 35 సంవత్సరాలు బ్యాంక్ లో పని చేయుటకు ప్రభువు కృప చూపించారు. ప్రభువైన యేసుని అంగీకరించి యుండకపోతే నా ఆత్మ మరియు శరీరము నశించి నరకంలో పడిపోయేవి. కాని వాటన్నింటిని మార్చి నా జీవితాన్ని మార్చినవాడు యేసయ్య మాత్రమే.

 

నా ప్రియ సహోదరి సహోదరులారా! విద్యార్థులారా అపజయాన్ని చూసి భయపడవద్దు, కృంగిపోవద్దు మన కష్టములను కన్నీళ్లను మార్చిన దేవుని యొద్ద మీ జీవితములను సమర్పించు కొనండి ఆయనే మీ యొక్క వంకర జీవితాన్ని సరి చేసి నడిపిస్తాడు. ఆమెన్.

- శ్రీమతి. భువన ధన బాలన్ గారు

 

 

ప్రార్థన అంశం:-

ఈ నూతన నెలలో సేవ హద్దులు విస్తరించేలా మరియు దేవుడు దయ చేసి దర్శనాలు ఆటంకం లేకుండా నెరవేర్చ బడేలా ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet