Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.07.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 03-Jul-2022

దిన ధ్యానము(Telugu) 03.07.2022 (Kids Special)

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం

 

అంశం:- గుడ్ ఫ్రెండ్ 

 

“బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహి తుడు కలడు” - సామెతలు 18:24

 

హాలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్త టీచర్స్ తో, కొత్త ఫ్రెండ్స్ తో స్కూల్ లైఫ్ సూపర్ గా ఉందా? అయితే జీసస్ కి థాంక్స్ చెప్పాలి. మీరు స్కూల్ కి వెళ్ళినప్పుడు యేసయ్యను మీతో పాటు తోడుగా తీసుకొని వెళ్ళాలి అప్పుడు మీకు ఆశీర్వదకరంగా ఉంటుంది. మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు స్కూల్లోనే కదా వుంటున్నారు. ఆతరువాత ట్యూషన్ కి వెళ్లిన అక్కడ కూడా స్నేహితుల కూటమే. కాని మంచి స్నేహితులు ఉండాలి కదా? ఫ్రెండ్స్ లేకపోతే జీవితమే బోర్ కొడుతోంది. అందుకే మంచి వారితో స్నేహం చెయ్యాలి. ఓకేనా!

 

బైబిల్లో యోసేపు అన్నయ్య చెయ్యని తప్పు కొరకు చెరసాలలో బంధింప బడ్డాడు. అదే చెరసాలలో రాజుకు బోజనం అందించే భక్ష కారుల అధిపతి మరియు పానదాయకుల అధిపతి కూడా ఉండేవాడు. వీరు వారికొచ్చిన కలల భావం తెలియక దిగులుగా ఉన్నారు. వారితో యోసేపు అన్న మాట్లాడి దేవుని కృపతో వారి కలలకు అర్ధం చెప్పాడు. అప్పటి నుండి వారు మంచి స్నేహితులుగా వుండేవారు. జైలులో ఉండే యోసేపు అన్నయ్య హ్యాపీగా ఉండేవాడు ఎందుకో తెలుసా యేసయ్య అతనికి తోడుగా వున్నారు కాబట్టి. అందును బట్టి యోసేపు హ్యాపీగా ఉండేవాడు. యోసేపు అన్నయ్య తన స్నేహితులతో మాట్లాడి వారికి సహాయం చేసాడు. యోసేపు అన్నయ్య చెప్పినట్లే తన ఫ్రెండ్ రాజుకు గిన్నె అందించడానికి వెళ్ళాడు. 

 

ఒక రోజు రాజు తనకు వచ్చిన కల వలన కలవరపడి భయపడ్డాడు. ఐగుప్తు శకునగాండ్రులు మరియు విద్యావంతులు ఎవ్వరూ కూడా దాని అర్థం చెప్పలేకపోయారు. వెంటనే ఆ ఫ్రెండ్ కు యోసేపు జ్ఞాపకం వచ్చాడు. రాజు కలకు అర్థం చెప్పి నాకంటే గొప్పవాడు అయిపోతాడేమో అని అనుకున్నప్పటికి యోసేపు గురించి చెప్పాడు. మంచి స్నేహితుడు ఎల్లప్పుడు నిజాయితీగా ప్రేమిస్తాడు. ఇందువలన యోసేపు రాజుకు తరువాత నాయకునిగా హెచ్చించబడ్డాడు. యోసేపు యొక్క ఉన్నత స్థాయికి ఆ స్నేహితుడు కారణం అయ్యాడు. 

 

ప్రియమైన పిల్లలారా! యేసయ్య మిమ్మల్ని చాలా అధికముగా మరియు నిజాయితీగా ప్రేమిస్తున్నట్లే మీరు కూడా మీ ఫ్రెండ్స్ ని నిజాయితీగా ప్రేమించాలి. అలాంటి మంచి స్నేహితులు దొరకాలని ప్రార్ధన చెయ్యండి. అవసరానికి వాడుకొని స్నేహితులకు ద్రోహం చెయ్య కూడదు. సరేనా! సరే పిల్లలు మనం మంచి వాళ్ళతో స్నేహం చెయ్యాలి అని మనం నేర్చుకున్నాం కదా మరి ఈరోజు ఒక కంఠత వాక్యం నేర్చుకొందామా.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet