Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.07.2022
Share:

By Village Missionary Movement

Friday, 01-Jul-2022

దిన ధ్యానము(Telugu) 02.07.2022

 

అంశం:- న్యాయము జరిగించు దేవుడు.

 

"నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతి ఫలము పొందుదురు గదా" - సామెతలు 11: 31

 

మణునీతి చోలా అనే రాజు గురించి మనం వినే ఉంటాం. ఆ పేరు అతనికి రావడానికి గల కారణం అతను చేసే నీతి క్రియలే. ఒక సారి తన రథము పైన తన కుమారుడు వెళ్తున్నప్పుడు ఊహించని విధముగా ఒక పిల్ల దూడపైన ఎక్కించేసాడు. ఆ దూడ వెంటనే చనిపోయింది. దానిని చూసిన ఆ తల్లి ఆవు కన్నీరు కార్చింది. దానిని చూసిన రాజు కొంచం కూడా ఆలోచించ కుండా, తన కుమారుడు అని కూడా చూడకుండా తన కుమారుడి యొక్క మెడ పై ఆ రథం యొక్క చక్రం ఎక్కించి చంపేశాడు. ఇందువలన మణు అనే అతని పేరుకు మణు నీతి అని తమిళం చరిత్రలో వ్రాయబడింది. 

 

అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలో 4:8లో నీతి గల న్యాయాదిపతి అయిన ప్రభువు అని వ్రాసాడు. తీతుకు వ్రాసిన పత్రికలో 1:3లో ఆయన అ బద్దమాడని దేవుడు అని వ్రాయబడి ఉన్నది. లూకా సువార్తలో 16వ అధ్యాయంలో లాజరు మరియు ధనవంతుని గురించి మనం చూడ గలం. అందులో లాజరు మిక్కిలి దరిద్రునిగాను మరియు దేహం అంత కురుపులతో నిండిన వాడిగా ఉన్నాడు. కాని ధనవంతుడు ప్రతి రోజు సుఖ పడుచుండు వాడు. కాని వీరు మరణించినప్పుడు లాజరు అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు పాతాలములో బాధపడుచుండెను. లూకా సువార్త 16: 25 లో అబ్రాహాము ధనవంతుని చూస్తూ నీవు నీ జీవిత కాలంలో నీకిష్టమైన విధముగా సుఖము అనుభవించితివి అలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకం చేసెను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు కాని నీవు యాతన పడుచున్నావు అని అన్నాడు. అవును మన దేవుడు నీతి గల న్యాయాదిపతి.

 

అవును ప్రియమైన వారలారా! ఆయన నీతి గల న్యాయాదిపతి ఆయన యొద్ద అన్యాయం లేదు. ప్రసంగి 11:9 లో చెప్పబడిన విధముగా మన ఇష్ట ప్రకారముగా బ్రతుకుటకు మనకు హక్కు ఉంది. కాని వాటన్నింటి నిమిత్తం మనకు న్యాయం తీర్చబడుతుంది. ఒక వేళ లోకస్తుల కన్నులకు తెలియకుండా అంతరంగములో పాపము చెయ్యవచ్చు. దానిని గూర్చి ఎవరికి తెలుస్తుందిలే అని కూడా అనుకొనవచ్చును. మనం చేసేదే సరైనది అని మనలో ఆలోచన కలుగవచ్చు. కాని న్యాయ తీర్పు రోజున రాళ్లు మరియు గోడలు కూడా మనకు వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయి. దేవుడు నీతిగా న్యాయం జరిగించువాడు. కృపా కాలం ముగియనున్న ఈ రోజుల్లో మణునీతి చోలా తన కుమారుడు అని కూడా చూడని విధముగా దేవుడు కూడా పక్షపాతం లేకుండా న్యాయం తీర్చుతాడు. అందువలన జాగ్రత్తగా నడుచుకొందాం, నిత్య జీవితమును పొందుకొనుటకు ప్రయాస పడదాం.

- శ్రీమతి. స్టెఫి రాక్ సన్.

 

ప్రార్థన అంశం:-

తమిళనాడులో ప్రతి సేవా స్థలములో జరుగుతున్న ఉజ్జీవం ఆశించే కూటం అనే ఈ కూటంలో దేవుని మహిమ బయలు పడేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al