Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.07.2022
Share:

By Village Missionary Movement

Thursday, 30-Jun-2022

దిన ధ్యానము(Telugu) 01.07.2022

 

అంశం:- ఓటఫ్ థాంక్స్.

 

"కృతజ్ఞులై యుండుడి" - కొలస్సీయులకు 3:15

 

పాఠశాలలో, కళాశాలలో మరియు ఆఫీసులో జరిగే ప్రత్యేకమైన కార్యక్రమాల్లో చివరి సమయంలో ఓటఫ్ థాంక్స్ అనే దానిని మనం చూసి ఉంటాం. ఆ యొక్క ఓటఫ్ థాంక్స్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారు, అందులో పాల్గొన్నావారు, కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణం అయిన వారు బాధ్యతలు కలిగి ఉన్న వారు ఇలా చాలా మందికి కృతజ్ఞతలు తెలుపబడును. దీనినే ఓటఫ్ థాంక్స్ అని అంటారు. 

 

పరిశుద్ద గ్రంధంలో దావీదు అనే కీర్తన కారుడు చాలా రకాలైన కీర్తనలను మరియు పాటలను పాడాడు. అందులో ఒకటి మాత్రమే కృతజ్ఞతలు తెలిపిన విధముగా పాడిన 103వ కీర్తన. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని పాడాడు. దావీదు జీవితంలో చాలా రకాలైన పోరాటాలు, సమస్యలు, శత్రువులు వెంటాడుతున్న గాని వాటి మధ్యలోనే దావీదు కృతజ్ఞతలు తెలిపి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని పాడుతున్నాడు. యెహోవా చేసిన సమస్త మేలులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! ఈ సంవత్సరంలో 6 నెలలు మనలను కాపాడిన దేవునికి కృతజ్ఞతలు కలిగిన హృదయంతో వందనములు తెలుపుదాం. సంవత్సరం మొదలుకొని ఈరోజు వరకు ఆయన మన ఆత్మకు, శరీర అవసరాలకు ఎన్నో మేలులు చేసి యున్నారు. మనలను మన కుటుంబీకులను ఘోర వ్యాధుల నుండి సంరక్షించారు. ఇకపై నా పరిస్థితి ఇంతే అనుకున్న చాలా సమయాల్లో నూతన ప్రారంభమును కలుగజేశారు. ఇటువంటి చాలా రకాలైన మేలులు కొరకు కృతజ్ఞత కలిగిన హృదయముతో ఆయన పాదముల చెంత కూర్చొని వందనం చేద్దాం. ఆయన నడిపించిన సమస్తమైన వాటి కొరకు మనం కృతజ్ఞతలు తెలుపవలసిన వారమై యున్నాము. సాధారణమైన మనుష్యులు మనకు సహాయం చేసినప్పుడు థాంక్స్ చెప్పే మనం భూమి ఆకాశములను సృజించిన దేవునికి మనం ఎంతగా కృతజ్ఞతలు చెప్పాలి అనేదాన్ని కొంచం అలోచిద్దాం. కృతజ్ఞలై యుండుట నేర్చు కొందాం.

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు

 

ప్రార్ధన అంశం:-

ఈ నెల అంత జరుగబోయే పరిచర్యలలో దేవుని హస్తం తోడై యుండి నడిపించు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al