Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.06.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 29-Jun-2022

దిన ధ్యానము(Telugu) 30.06.2022

 

అంశం:- ఏలీయా దేవుడు.

 

"కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును" - కీర్తనలు 121:1

 

ఇశ్రాయేలీయుల రాజైన అహాబు యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. సమరయలో బయలుకు మందిరమును మరియు బలి పీఠమును కట్టి యెహోవాకు కోపము తెప్పించెను. అప్పుడు యెహోవా ఏలీయా ప్రవక్త ద్వారా దేశములో ఈ సంవత్సరంలో మంచు అయినను వర్షం అయినను పడదని అహాబు రాజుకు ప్రకటించాడు. ఏలీయాను కెరీతూ వాగు దగ్గర దాగియుండమని సెలవిచ్చారు. వాగు దగ్గర దాగియున్న ఏలీయా యొక్క పరిస్థితి ఏమిటి అనేది కొంచం ఆలోచించి చూద్దాం. అక్కడ మనుష్యులు ఎవ్వరు ఉండరు, త్రాగుటకు నీళ్లు తప్ప వేరే పానీయాలు అనగా ద్రాక్షారసము కూడా ఉండదు. పండుకొనుటకు మంచము, దుప్పటి కూడా ఉండదు. ఆకలి వేసిన గాని తినుటకు ఏమి ఉండదు. దేవుడు పంపుతున్న కాకి ఎప్పుడు వస్తుందో అని ఆకాశం వైపు చూస్తూ ఉండి ఉంటాడు ఏలీయా. ఆ కాకి రొట్టె, మాంసమును తీసుకువచ్చి ఇచ్చే బాధ్యతను అంగీకరించి నిజాయితీగా నడుచుకోంది. ఎవ్వరు వెళ్లలేని ఆ స్థలములో క్రియ చేసి పోషించిన దేవుడు అద్భుతమైన వాడు కదా!

 

అదే విధంగా మీరు కూడా అనుకూలమైన పరిస్థితుల్లో లేకుండా ఒంటరైన పరిస్థితుల్లో ఉన్నారా? పిల్లలను ఎలా పెంచుతానో? ఈ నెల అంతా కుటుంబ ఖర్చులను ఎలా చూసుకొంటాను? పెళ్లి వయస్సుకు వచ్చిన పిల్లలకు వివాహ విషయంలో ఎవరు సహాయం చేస్తారు? వ్యాధులకు కావలసిన చికిత్స డబ్బు ఎక్కడనుండి తేవాలి? అని చాలా విధాలుగా కృంగిపోతున్నారా? దేవుని వైపు చూడండి సొంత వారు స్నేహితులు, బంధువుల సహాయం చేస్తారు అని మనుష్యుల పైన ఆధార పడవద్దు. కాకులు వలె వారు సహాయం చేస్తారు అని ఎదురు చూడ వద్దు. ఏలీయా ను పోషించినవి కాకులు కాదు గాని వాటిని పంపిన దేవుడే ఆ కార్యమును చేసాడు. 

 

ప్రియమైన వారలారా! ఈనాడు మనం మనకు సహాయం చేయుటకు కాకులను వెతుకుతున్నమా? లేక కాకులను పంపిన దేవుని యందు విశ్వాసముంచుతున్నమా? దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే కాకి ఎగిరి రాదు అందువలన మనకు సహాయం చేస్తున్న దేవుని వైపే చూద్దాం. నా భర్త క్యాన్సర్ వ్యాధితో బాధింపబడినప్పుడు చికిత్స కొరకు చాలా డబ్బు అవసరమైనది. ఎక్కడ సహాయము నాకు లేదు. ఆ కఠినమైన పరిస్థితుల్లో ఊహించని విధముగా కాకుల వలె మనుష్యులను పంపి ఏలీయా ఆవసరతలు సంధించిన విధముగా దేవుడు నా అవసరాలను కూడా తీర్చాడు. అవును ఆనాడు ఏలీయా ను పోషించిన వాడు, ఈనాడు నన్ను నడిపించిన వాడు మిమ్మల్ని కూడా కచ్చితంగా నడిపిస్తాడు. చింతించకండి!

- శ్రీమతి. భువనా ధనబాలన్ గారు

 

ప్రార్థన అంశం:-

ఉత్తర రాష్ట్రాల్లో నూతన సేవ పరిచర్యలు ప్రారంభించుటకు దేవుడు కృప చూపు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al