Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.06.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 29-Jun-2022

దిన ధ్యానము(Telugu) 29.06.2022

 

అంశం:- ఉచితం.

 

"కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును" - మత్తయి 6:33

 

అల్లం 'టీ' త్రాగడానికి సుఖి మరియు తన స్నేహితురాలు రాణి ఇంటికి వెళ్లేవారు. అదే అలవాటుగా ఒక రోజు ఇంటికి వెళ్ళినప్పుడు గ్లాస్ కి బదులుగా పింగాణీ. కప్పు తీసుకు వచ్చింది సుఖి. చాలా ఆశగా తీసుకొని త్రాగింది కాని అది టీ కాదు కాఫీ. ఎందుకు అల్లం టీ చెయ్యలేదు అని అడిగినప్పుడు సుఖి సన్ రైస్ కొంటె దానితో కప్పు ఫ్రీగా ఇవ్వబడును అని చెప్పడంతో నేను రెండు సన్ రైస్ ప్యాకెట్లు కొనేసాను. అందుకే మా ఇంట్లో టీ పౌడర్ లేదు మేము కాఫీ కి అలవాటు పడిపోయాము. ఉచితం అంటేనే ఇంటివారికి ఉత్సాహం. పరిశుద్ద గ్రంధంలో కూడా మొదట దేవుని రాజ్యమును నీతిని వెతికినప్పుడు ఆహారం, దుస్తులు మనకు కావలసిన అన్నింటినీ పొందుకుంటాం. మనం కష్ట పడేది ఈ చిన్న పొట్ట కొరకే అని చెప్పుటను మనం విని ఉంటాం. జీవించుట కొరకైనా ఇవన్నీ ఉచితం ఎప్పుడు అంటే దేవున్ని మొదట వెతికినప్పుడు ఆయనకు మొదట స్థానం ఇచ్చి ఆయన నీతిని ,ఆయన రాజ్యామును మొదట వెతికినప్పుడు. కాని మనం ఈలోకంలో ఉచితంగా ఇచ్చే వాటికొరకు మాత్రమే ఆశ పడుతున్నాం, ముఖ్యమైన వాటిని చెయ్యడం లేదు.

 

మన జీవిత క్రియలు ఎలా ఉన్నా అరగంట సమయం అయినా మొదట ఆయన పాదముల చెంత సమయాన్ని గడిపినట్లయితే మిగతా ఇరవై మూడున్నర గంటల సమయం ఇవ్వబడును అని పరిశుద్ద గ్రంధం సెలవిస్తోంది. అవసరమైనది రెండతలుగా ఇవ్వబడితే సంతోషమేగా! 

 

ప్రియమైన వారలారా! మీరు దేనిని వెతుకుతున్నారు? ఉచితంగా దొరికే లోకపు క్రియలనా లేకా దేవుని రాజ్యమునా? సంపాదించడం, వండటం, షాపింగ్ లకు వెళ్లడం అనేవాటి కొరకు సమయాన్ని గడుపుతున్నారు. కాని దేవుని పాదాల యొద్ద సమయం గడుపుటకు సమయం లేదు అంటున్నారు. పిల్లలు, భర్త, స్నేహితులు, బంధువులు ఇలా అందరితో సమయాన్ని గడుపుతున్న కాని ప్రభువుని మర్చిపోతున్నాం. అయ్యో జీవితం చాలా కష్టంగా ఉంది. మోసం అపజయం అంటూ సానుగుకొంటున్నాం. దేవునితో సమయాన్ని గడిపి వెతికినప్పుడు అటువంటి అవసరతలు అన్నీ ఉచితమే. లోకం ఏదైనా ఉచితం అంటే మనం వాటి కొరకు పారిపోతున్నాం. సుఖి కూడా కాఫీకు కప్పు ఉచితం అనగానే కాఫీకు మారిపోయిన విధముగా దేవుడు ఇచ్చే ఉచితమైన వాటిని పొందుకొని మనలను మార్చుకుందాం. మనం పరిశుద్ద గ్రంధము ప్రకటించే ఉచితమును పొందుకోకుండా శత్రువు మనలను మార్చేస్తాడు. వాడి యొక్క మోసపూరితమైన మాటలను నమ్మవద్దు. దేవుని క్రియలకు మొదట స్థానం ఇవ్వండి. ఉచితంగా పొందుకోవలసిన వాటిని పొందుకొనుటకు ఎందుకు కష్టపడాలి.

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్.

 

ప్రార్ధన అంశం:-

ప్రార్ధనా గుడారపు పనులు 75% పూర్తయినవి మిగతా పనుల యొక్క అవసరతలు సందించబడేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al