Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.06.2022
Share:

By Village Missionary Movement

Monday, 27-Jun-2022

దిన ధ్యానము(Telugu) 28.06.2022

 

అంశం:- శత్రువులను ప్రేమించుడి.

 

"మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి" - లూకా 6:27

 

ఆఫ్రికా దేశంలో ఆర్థికంగా మిక్కిలి వెనుకబడిన యాగో జాతి గిరిజనుడు అయిన ఒకంజీ అనే ఒక కలప వ్యాపారి యేసుక్రీస్తు ని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. తన పని చేసే స్థలములో పెద్ద జాతి అయిన యజమానుడు మాన్సి జో యాగో జాతిని ద్వేషించడం వలన ఒకంజీని పనినుండి తీసివేయుటకు కారణములు వెతుకుతున్నాడు. ఆ జాతి పైన ఉన్న ద్వేషం వలన ఒకంజీని పనికి రావద్దు అని చెప్పేసాడు. ఇతను పగిలిన మనస్సు గలవాడై మాట్లాడిన ఆ యజమాని మనస్సు మాత్రం కరుగకుండా రాయిలా ఉండేది. అప్పుడు వారికి సమీపంలో ఉన్న పెద్ద చెట్టును కొంతమంది కోయుటను చూసిన ఒకంజీ మొదట చెట్టు యొక్క పెద్దపెద్ద కొమ్మలను కోసి ఆ తరువాత చెట్టును కోయాలి లేకపోతే అది దిశ మారి పడుతుంది అని చెప్పాడు. కాని వారు ఇతని మాటలను వినకుండా ఆ చెట్టును కోస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆ చెట్టు విరిగి పక్కనే ఉన్న బండి పైన పడుటను చూసి ఎంత మాత్రం ఆలస్యం చెయ్యక ఆ బండిలో ఉన్న తన యజమానుని బయటకు లాగి ప్రక్కకు తీసుకు వెళ్ళాడు ఒకంజీ. వెంటనే యేసయ్య మీకు కృతజ్ఞతలు అని చెప్పుటను గమనించిన మాన్సి జో యొక్క మనస్సు వేల కొలది ప్రశ్నలతో నిండి పోయింది. ఒకంజీ నువ్వు ఎలా నన్ను కాపాడ గలిగావు నేను నిన్ను పూర్తిగా ద్వేషించి నిన్ను హింసిస్తూ వచ్చాను కదా! దానిని కూడా లెక్క చేయకుండా నన్ను ప్రేమించి నాకు సహాయం చేసావు అని మాన్సి జో అడిగాడు. యేసుక్రీస్తు ను నమ్మి ఆయనను పూజించుట వలన ఇలా చెయ్యగలిగాను అని చెప్పిన ఒకంజీని చూస్తూ మాన్సి జో కన్నీరు కార్చాడు. నన్ను క్షమించు నేను కూడా నీ రక్షకుని గూర్చి తెలుసుకోవాలి అని ఆశ పడుతున్నాను అని అన్నాడు. 

 

యేసుక్రీస్తు తనను పట్టుకొనుటకు వచ్చిన వాని చెవిని పేతురు నరికినప్పుడు ఆయన కరుణించి ఆ చెవిని అతికించి అద్భుతం చేశారు. తనను సిలువలో వేసిన వారిని శపించ కుండా వారిని క్షమించారు. అంతేకాదు తండ్రిని కూడా క్షమించమని వేడుకున్నారు.

 

 ప్రియమైన వారలారా! మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి అని యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు. ఇలా చేయడం కష్టమైన యేసుక్రీస్తు మనలో ఉంటే నిశ్చయముగా మనం ఆ విదంగా చేయగలం. మనం మేలు చేసినప్పుడు ఇతరులు మనలను శపిస్తే కచ్చితంగా మనకు కోపం వస్తుంది కాని ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ మన హృదయంలో ఉంటే వారిని మనం ఆశీర్వదించగలం.

- బ్రదర్. హరీష్ శామ్యూల్ గారు

 

ప్రార్ధన అంశం:-

7000 మంది మిషనరీల ద్వారా ఒక లక్ష గ్రామాలను సందించుటకు తీసుకున్న తీసుకొంటున్న ప్రయాసలో దేవుని హస్తం తోడైయుండు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al