By Village Missionary Movement
Friday, 24-Jun-2022దిన ధ్యానము(Telugu) 24.06.2022
అంశం:- నీవు దూరస్తుడవు కావు.
"అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించినీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయ నను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు" - మార్కు 12:34
ఒక శాస్త్రి, ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఆజ్ఞ లన్నింటిలో ప్రధానమైనది ఏది అని ఆయనను అడిగెను. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునది ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పారు. ఆయన చెప్పిన దానికి బదులుగా శాస్త్రి ఏమి చెప్పలేదు. ఇందు వలననే యేసు నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అని అతనితో అన్నారు. పరిశుద్ద గ్రంధంలో యేసుక్రీస్తు కొందరిని గద్దించుట చూస్తున్నాం. కాని ఈ వ్యక్తిని ఆయన గద్దించ లేదు. అందువలన అతను ఇతర పరిసయ్యులు మరియు శాస్త్రులు కంటే ప్రత్యేకమైన వారిలా ఉండాలి. అందులో మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆ శాస్త్రి దేవుని రాజ్యంలో లేదా ఆయన పరిపాలనలో లేడు కాని దానికి సమీపంలో ఉన్నాడు. అవును ఈ వ్యక్తిలో ఉన్న విశ్వాసం తన హృదయంలో కాదు అది కేవలం తన మెదడులో ఉన్నది. వాక్యం మనకు సమీపంలో ఉంటే సరిపోదు అది హృదయంలో వున్నప్పుడు మాత్రమే క్రియ జరిగి సత్యంలోనికి నేరుగా మనకు నడిపిస్తుంది.
నోవహు కాలంలో జల ప్రవాహం రావడం సాధ్యమని ప్రజలు ఊహించలేదు. పాపమును విడిచిపెట్టి మారుమనస్సు పొందమని నీతిని నోవహు ప్రకటించాడు అని 2పేతురు 2:5లో మనం చూడ గలం. వారు నోవహును హేళన చేసారు. ఓడ తయారు చేసే స్థలములో వడ్రంగి పని చేసేవారు ఉండి వుంటారు వారు కూడా నోవహు మాట వినలేదు. కేవలం కూలి కొరకు మాత్రమే పనిచేయడానికి వచ్చారు. జల ప్రవాహం వచ్చినప్పుడు ఓడ దగ్గర ఉన్న వారు కచ్చితంగా ఓడ తలుపు తట్టి తెరుచుటకు ప్రయత్నం చేసి ఉంటారు. కాని తలుపు తెరవబడలేదు. ఎందుకనగా ఓడ తలుపు నోవహు ద్వారా కాదుగాని అది దేవుని ద్వారా మూయబడినది. ప్రజలకు ఓడకు ఎంతో దూరం లేదు కాని చాలా పరితాపం ఎవ్వరు లోనికి ప్రవేశించ లేకపోయారు.
ప్రియమైన వారలారా! పైన చెప్పబడిన రెండు సందర్బాలు మూలముగా మనలను మనమే పరీక్షించు కొందాం. దేవుని రాజ్యమునకు సమీపములో ఉన్నామా? లేదా దేవుని రాజ్యము లోపల ఉన్నామా? మన యొక్క మెదడులో ఉన్న వాక్యము బయలు పడకపోయినట్లయితే మనం దేవుని రాజ్యమునకు బయటే ఉన్నాము అని అర్ధం. దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అని అనినప్పటికి దేవుని రాజ్యములో మనం లేము అనే విషయం పరితాపమైనది. అందువలన మనం ఎరిగి ఉన్న వాక్యమునకు హెచ్చరికలకు చెవి యొగ్గి మన జీవితమును దేవుని వైపు తిప్పి ఆశీర్వాదములను పొందుకుందాం.
- శ్రీమతి. ఏం. హెప్సి మణువేల్ జయ రాజ్ గారు
ప్రార్ధనా అంశం:-
యవ్వనరాలా విను అనే తమిళ పత్రిక ద్వారా అనేక యవ్వన స్త్రీలు ఉజ్జీవ సాధనముగా అభివృద్ధి చెందేలా ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250