Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.02.2021
Share:

By Village Missionary Movement

Monday, 01-Feb-2021

దిన ధ్యానము(Telugu) 01.02.2021

పంచి పెడదాము.

"కాబట్టి చెదరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి" - అపో.కార్యములు 8: 4

దేవునిచే బలముగా వాడబడిన  'విగిల్స్ వర్త్' అనే       దేవుని దాసుని యొక్క కూడికలు సిడ్నీలో జరిగాయి. ఒక దినము ఆహారము కొరకు ధనవంతులు, సమాజంలో ఉన్నతంగా ఉన్నవారు మాత్రమే వెళ్ళగలిగే ఒక పెద్ద హోటల్ కు ఆయనను తీసుకువెళ్లారు. అక్కడకు వెళ్లిన వెంటనే  విగిల్స్ వర్త్  తన గ్రద్ద వంటి చూపుతో అక్కడ ఉన్న వాళ్ళందరిని చూసారు. అక్కడ ఉన్న వెండి ఫోర్క్ తో గాజు గ్లాస్ పై కొట్టటడం ప్రారంబించారు. వెంటనే ఆ స్థలమంతా నిశ్శబ్దం అయిపోయింది. ఆహారం భుజించే వారు అలా కదలకుండా నిలబడిపోయి ఉన్నారు. అయన తన చేతుల్ని పైకి ఎత్తి ఘనత కలిగిన వారాలరా నేను వచ్చినప్పటి నుంచి  చూస్తున్నాను ఎవరూ కూడా తినడానికి  ముందు  ప్రార్ధించలేదే  మిమ్మల్ని చూస్తే పందుల గుంపుని చూసినట్లు ఉంది. ఈ ఆహారాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కూడా చెప్పకుండ ఇలా మింగేస్తున్నారే తలలు వంచండి నేను మీ కొరకు ప్రార్ధిస్తాను అని ప్రార్ధించారు. ఆయన ఆహారాన్ని భుజించి వెళ్ళే ముందు భోజనానికి వచ్చినవాళ్ళు ఇద్దరు ఆయన దగ్గరకు వచ్చి ఆయన కుటుంబముతో రక్షణ పొంది ప్రార్ధన చేయించుకుని వెళ్ళారు. ఇలాగు ఆయన రక్షణను గురించి ప్రకటించే స్థలము ఎక్కడైనా ఆయన దానిని వాడుకునే వారు.

అపోస్తులకార్యములలో సువార్త అన్ని కోవలకు చెందిన ప్రజలకు వెల్లింది అని చదువుకుంటున్నాం. పక్షపాతము, భయము వీటన్నింటిని దాటి సువార్తను ప్రకటించారు.

1. పేతురు:- ఈయన పెద్ద చదువరి కాకపోయినప్పటికి ఈయన ప్రసంగం వలన 3000 మంది, 5000 మంది అని ఎక్కువ మొత్తంలో అనేకమంది సువార్తను అంగీకరించారు. బైబిల్లో పరిపక్వత చెందిన వారైనా పరిసయ్యులు, యాజకుల యొద్ద కూడా భయపడ కుండా మాట్లాడారు. పెద్ద గుంపుకు మాత్రమే కాదు ఇటలీ పట్టణములో కొర్నేలి ఇంటిలో చిన్న ప్రార్థనా గుంపులో కూడా దేవుడు ఇతనిని వాడుకున్నారు. 

2. ఫిలిప్పు:- ఈయన ఆదిమ సంఘంలో విచారణ కర్తగా ఉండినప్పటికి ఈయన చెప్పిన సువార్త వలన ఒక పట్టణమే సంతోషించేటట్లు దేవుడు చేసారు. ఐతీయోఫియ మంత్రి అరణ్యంలో వెళ్తున్నప్పుడు దేవుడు ఆయన రక్షణ కొరకు ఈయనను వాడుకున్నారు. 

3. పౌలు:- గొప్ప చదువరి అయిన ఈయన కూడా లూథియా యొక్క హృదయాన్ని తెరిపింపజేసీ ఆమె కుటుంబాన్ని రక్షణలోనికి  నడిపించారు. చెరసాలలో ఉండినప్పుడు కాపలా వారు కుటుంబం అంతా కూడా యేసయ్యను రుచి చూసారు . ఇలాగు అనేక పట్టణములలో, భవనములలోను, అధికారుల యెదుటను, దీవిలోను అనేకమైన స్థలనులలోను  అనేక విధములైన ప్రజల మధ్యలో కూడా పౌలు ప్రసంగించారు. 

ప్రియమైన వారలారా! సువార్త అన్నది మనుష్యునిగా పుట్టిన అందరికి పంచి పెట్టవలసిన ఒక సొత్తు. అది పేద వాళ్ళు, ధనవంతులు ,బానిసలు, యజమానులు, పనివాళ్ళు అని అన్ని కోవలకు చెందినది, అన్ని వయస్సు గలవారికి చెందినది, అన్ని దేశములకు, అన్ని రంగుల గలవారికి చెందినది. కాని దీనిని పొందుకున్న మనము ఇతరులకు ఇవ్వకుండా ఉంటున్నామా? ఆలోచిద్దాం. దీనిని పొందుకున్న మనము అందరికి పంచి పెట్టవలసిన బాధ్యత మన మీద ఉందని గ్రహించి ఇతరులకు పంచిపెడదాం.
-    బ్రదర్. మనోజ్ కుమార్

ప్రార్థన అంశం:-
ఈ నెల అంతా జరగబోతున్న పరిచర్యలో దేవుని హస్తం తోడైయుండి నడిపించులాగున  ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet jojobet jojobet matbet egebet giriş egebet matbet matbet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş coinbar coinbar giriş restbet giriş restbet egebet güncel giriş egebet coinbar giriş coinbar interbahis interbahis giriş mariobet mariobet giriş klasbahis güncel giriş klasbahis artemisbet artemisbet giriş klasbahis giriş klasbahis restbet restbet giriş egebet egebet giriş superbetin superbetin giriş perabet perabet giriş grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel jojobet jojobet giriş holiganbet holiganbet giriş casibom casibom giriş jojobet jojobet giriş alobet alobet giriş marsbahis marsbahis giriş perabet perabet giriş meritking meritking giriş meritking meritking giriş matbet matbet giriş superbetin superbetin giriş kingroyal kingroyal giriş kralbet kralbet giriş jasminbet jasminbet giriş ikimisli ikimisli giriş meritbet meritbet giriş sekabet sekabet giriş casibom casibom giriş kingroyal kingroyal giriş jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet amkbet wbahis esbet Sonbahis Sonbahis Sonbahis giriş Sonbahis giriş perabet perabet giriş casibom casibom giriş jojobet jojobet giriş