Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.06.2022
Share:

By Village Missionary Movement

Thursday, 23-Jun-2022

దిన ధ్యానము(Telugu) 24.06.2022

 

అంశం:- విలువైనది.

 

"విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి" - 1కోరింథీయులకు 6:20

 

ఒక ఊరిలో ఒక చిన్నవాడు ఉండేవాడు. తన ఇంటికి సమీపంలో ఒక సెలయేరు కూడా పారుతూ ఉండేది. ప్రతి రోజు పాఠశాలకు వెళ్లివచ్చిన వెంటనే చాలా కష్టపడి వెదురుతో చేసిన పడవను తీసుకొని ఆ సెలయేరులో అడుకొనేవాడు. తరువాత అలవాటుగా తన పడవను ఇంటికి తీసుకొని వచ్చేవాడు. ఒక రోజు అదే అలవాటుగా చాలా కష్టపడి వెదురుతో చేసిన ఆ పడవను తీసుకొని వెళ్లి సెలయేరులో అడుకొంటున్నాడు. నీటి ప్రవాహం అధికముగా ఉండటం వలన ఆ పడవ నీటిలో కొట్టుకొని పోయింది. ఆ చిన్న వాడు చాలా బాధపడ్డాడు. తరువాత ఒక రోజు చివరి వీధికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దుకాణంలో తన పడవ ఉండటం చూసాడు. వెంటనే ఆ దుకాణ దారునితో ఆ పడవను ఇవ్వమని అడిగాడు. కాని అతను ఆ చిన్న వాని మాటలు విననే లేదు. డబ్బులు ఇస్తేనే పడవ ఇస్తాను అన్నాడు. ఆ చిన్న వాడు ఇంటికి వెళ్లి తాను డబ్బులు దాచుకున్న డిబ్బిలో డబ్బులు తీసుకు వచ్చి ఆ పడవను తీసుకొని వెళ్ళాడు. వెళ్తున్న దారిలో ఆ పడవను ముద్దాడుతూ నువ్వు రెండు విధాలా నాకు సొంతం అయ్యావు. ఒకటి నేను నిన్ను తయారు చేసాను, రెండు నేను నిన్ను వెల పెట్టి కొన్నాను అన్నాడు. 

 

పరిశుద్ద గ్రంధంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం 10-13 వచనాల్లో ప్రభువైన యేసు ఇదే విధముగా ఒక ఉపమానము చెబుతున్నారు. ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల 99ఇంటిని కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానికొరకు విశ్రాంతి లేకుండా వెతికాడు. దొరికిన వెంటనే ఎక్కువ సంతోషముతో దానిని తన భుజముల పైన ఎత్తుకొని తిరిగి వస్తారు అని చెప్పారు. 

 

అవును ప్రియమైన వారలారా! మనము కూడా తప్పిపోయిన ఈ గొర్రె వంటి వారమే. ప్రభువు మనలను సృజించి శ్వాసను ఊది ఆయనను ఆరాధించు లాగున మనలను చేస్తారు. కాని మనం లోక క్రియలు జరిగించి దారి తప్పిపోతున్నాం. ఆ చిన్న వాడి పడవ సెలయేరులో కొట్టుకొని పోయినట్లు మనము కూడా లోకం వెనుక వెళ్లి ప్రభువు నుండి వేరై పోతున్నాము. కాని దేవుడు మనపైన ఉంచిన గొప్ప ప్రేమ వలన మనలను వెతుక్కుంటూ ఒక మనుష్యుని వలె లోకమునకు వచ్చారు. మనలను రక్షించుటకు ఆ చిన్న వాడు పెట్టిన విలువ వలె త్యాగముగా తన సొంత రక్తమును సిలువలో కార్చారు. ఆయన ప్రేమ విలువైనది. చిన్న వాడు విలువ పెట్టి కొనిన తరువాత ఆ పడవ ఎలా అయితే తన కంటికి ప్రత్యేకంగా కనిపించిందో అదే విధంగా మనం ఆయన దృష్టికి విశేషముగా మరియు విలువైన వారముగా కనిపిస్తున్నాము అనే విషయాన్ని ఏ ఒక్క రోజు కూడా మర్చిపోకుండా ఆయన పిల్లలు వలె ఆయన చేతి క్రింద ధీనమనస్కులై ఉందాం. ఆమెన్.

- శ్రీమతి. దివ్య అలెక్స్.

 

ప్రార్ధనా అంశం:-

ప్రతి ఆదివారం 6:00-6:30 వరకు ప్రత్యక్షంగా యవ్వన స్త్రీల కొరకు ప్రసారం చేయబడుతున్న కార్యక్రమం ద్వారా అనేక మంది యవ్వన స్త్రీలు తాకాబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet