Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.06.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 22-Jun-2022

దిన ధ్యానము(Telugu) 23.06.2022

 

అంశం:- ఆయనకు తెలుసు.

 

"మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును" - మత్తయి 6:8

 

ఒక రోజు సాయంత్ర సమయంలో చల్లని గాలి వీస్తుంది. ఈసమయంలో పడవలో ప్రయాణం చేస్తే బాగుంటుంది అని అనుకున్న వ్యక్తి బోట్ ను తీసుకొని సముద్రము యొద్దకు వెళ్ళాడు. అతడు నడి సముద్రమునకు వెళ్లి నప్పుడు గాలి యొక్క వేగం తగ్గడంతో పడవను నడపడం చాలా కష్టంగా ఉంది. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో యేసయ్య గాలిని పెంచేలా చెయ్యండి అని ప్రార్ధన చేసాడు. యేసయ్య గాలి వేగమును పెరిగేలా చెయ్యండి నేను ఎలాగైనా తీరమును చేరుకోవాలి అని ప్రార్ధించాడు. కాని అతనికి ఎటువంటి జవాబు దొరకలేదు. మిక్కిలి అలసి కృంగిన వాని వలె ఉన్న అతను దూరంలో ఒక ఓడ రావడం చూసాడు. ఆ ఓడలో ఉన్న వారు అతని దగ్గరకు వచ్చి అతనికి కావలసిన సహాయం చేసి అతనికి ఆహారం ఇచ్చి అతనిని తన ఓడలో ఎక్కించుకొని ఆ పడవను ఓడకు కట్టి ప్రయాణం ప్రారంభించారు. చివరకు క్షేమముగా తీరముకు చేరుకున్నారు. అతను తీరం చేరుకున్న తరువాత ఈ విధముగా ప్రార్ధించాడు. ప్రభువా నాకు ఎప్పుడు ఏది అవసరమో మీకు చాలా బాగా తెలుసు వాటిని నాకు తగిన సమయంలో ఇచ్చి సహాయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు అని అన్నాడు. 

 

యోహాను సువార్త 5:1-9 వచనాల్లో 38 సంవత్సరాలుగా వ్యాధి గ్రస్తుడిగా ఉన్న వానిని గురించి మనం చదువుతున్నాం. తాను తన జీవుతంలో నమ్మకమును కోల్పోయి ఇకపై అంతే నేను బ్రతికి ఉండి ఏం ప్రయోజనం అని అతను అనుకొని ఉండవచ్చు. సొంత బలమును నమ్మి ఏం చెయ్యలేకపోయాను. ఇతరులను నమ్మి ఏమి ప్రయోజనము లేదు. అని బాధతో సనుగుకొని ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న తన దగ్గరకు యేసుక్రీస్తు వచ్చి స్వస్థత పొంద గోరుచున్నావా అని అడిగినప్పుడు ఆహా నాకు సహాయం చేసి కోనేటిలో దించుటకు ఒకరు వచ్చారు అని అతను అనుకొని ఉండవచ్చు. కాని యేసు మాత్రం అతను అనుకొన్న విధంగా కాక వేరేవిధంగా బదులిచ్చారు. నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువుము అని వానితో చెప్పారు. 

 

ప్రియమైన వారలారా! మనలో ఎంత మంది నా జీవితం నడి సముద్రంలో ఒంటరిగా ఉన్నది, సేవ చెయ్యాలి అని ఆశ ఉన్నది కాని చెయ్యలేకపోతున్నాను, నా కుమార్తె వివాహం చక్కగా జరగాలి అని ఇలా చాలా విషయాల్లో ప్రభువు జవాబు ఇవ్వాలి అని ఎదురుచూస్తున్నాం. మనం ఆశించే విధంగా ప్రభువు జవాబు ఇస్తే బాగుండును అని కూడా అనుకుంటాం. మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియును. ఆయన తన తీర్మానమును బట్టి సరైన సమాధానం ఇస్తారు. ఆయన మాట సెలవిస్తే చాలు జీవుతం మారడం నిశ్చయం. మీ ఆవసరతలను ఆయనకు తెలియజేసి మిమ్మును సంపూర్ణగా ఆయనకు సమర్పించు కొని ఆయన మీ కొరకు ఏం చేయబోతున్నాడో దాని కొరకు ఎదురు చూడండి. నిశ్చయముగా అద్బుతములు చూడ గలుగుతారు. ఆమెన్.

- సిస్టర్. ఐడా

 

ప్రార్ధనా అంశం:-

సేవకుల కొరకు వ్రాస్తున్న పత్రికలు పంపించుట కొరకు కావాల్సిన పోస్టల్ పర్మిట్ కొరకు ప్రార్ధించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al