Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.06.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 21-Jun-2022

దిన ధ్యానము(Telugu) 22.06.2022

 

అంశం:- అధికమైన కఠినం.

 

"నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి" - యాకోబు 3:1

 

ఆమ్స్టర్ డాం లో ఉన్న ఒక పెద్ద వేదికపై పదివేలకు మంది పైగా సువార్తికులు మరియు క్రైస్తవ నాయకులు కూర్చొని లోక ప్రసిద్ధి గాంచిన బిల్లి గ్రాహం గారి వాక్యమును వింటూ ఉన్నారు. ఆయన తన సేవ పరిచర్యలో ఉన్న అనుభవములను పంచుకున్నారు బిల్లి గ్రాహం. నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అనుకొంటున్నాను ప్రతిసారి దేవుని ప్రజల సమూహము ముందు నిలబడి ప్రసంగం చేసి నప్పుడు నా మోకాళ్ళు వణుకుతాయి అని అన్నారు. బిల్లీ గ్రాహం కు వాక్యం చెప్పడం రాదేమో అందుకే ఇలా చెబుతున్నారు అనుకొంటున్నారా అస్సలు కానే కాదు. దేవుడు బిల్లి గ్రహంను ఆయన ఘనమైన సేవలో ఆయన మాటలు బోధించటకు ఆయన ఇచ్చిన అవకాశాన్ని గుర్తు చేసుకొంటూ వినయముతో ఇలా చెప్పారు. ఈ లోకంలో అతి గొప్ప పని ఏమిటి అంటే భూమి ఆకాశములను సృజించిన దేవుడు చేసిన పరిచర్యే. పరిచర్యకు వచ్చిన ప్రతి ఒక్కరు ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. బోధకుల ప్రభువు చార్లెస్ సి.హెచ్ స్పర్ జన్ గారు ఈ విధముగా చెప్తున్నారు. ప్రసంగమును విని మారుమనస్సు పొందని పాపికి అధికమైన కఠినత్వము కలిగినప్పుడు అస్సులు మారుమనస్సే పొందకుండా ప్రసంగించే ప్రసంగీకుడికి ఎంతటి కఠినత్వము కలుగుతుందో తెలుసుకొన వలెను అని గద్దిస్తున్నారు. ఈనాడు ప్రసంగ పీఠము పైన నిలబడి నోటికొచ్చింది మాట్లాడి దేవుడు చెప్తున్నారు అని అనినప్పుడు ఎంతటి కఠినత్వము కలుగజేసుకొంటున్నాం అనేది ఎరిగి బోధకులు కాకుండుట మంచిది అని హెచ్చరిస్తున్నారు. అపోస్తు లుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తున్నప్పుడు మేము దేవుని వాక్యమును కలిపి చేరిపెడు అనేకుల వలె ఉండక నిష్కపఠము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై యుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించు చున్నాము అని వ్రాసారు.

 

క్రీస్తులో మిక్కిలి ప్రియమైన సహోదరులారా! సువార్త ప్రకటించుట మంచిది అలా చేయబడిన పరిచర్య దేవుని నడిపింపుతో ఉండాలి. దేవుని పరిచర్యను దేవుని మార్గంలోనే చెయ్యాలి అని ఒక సేవకుడు చెప్పారు. నేను చెప్పింది చేసింది అంతా పరిచర్య అవ్వదు. వ్యక్తిగత ప్రార్ధన లేకుండా, వాక్యమును ధ్యానించ కుండా ఒకడు వాక్యం చెప్పినట్లయితే అతని నోటి నుండి మరణ వాసన బయలు పడుతుంది అని లియోనార్ దేవన్ హిల్ చాలా స్పష్టంగా చెప్పారు. దేవుని వాక్యమును బోధించిన వారు చాలా జాగ్రత్తగా పరిచర్య చెయ్యాలి. మన దేవుడు దహించే అగ్ని వలె ఉన్నాడు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి. ఆమెన్.

- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు.

 

ప్రార్ధన అంశం:  

అఫీస్ పనిలో అవసరమయ్యే ల్యాప్ టాప్ మరియు కంప్యూటర్లు కొనేలా ప్రార్ధించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet