Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.06.2022
Share:

By Village Missionary Movement

Monday, 20-Jun-2022

దిన ధ్యానము(Telugu) 21.06.2022

 

అంశం:- ఎవరి కాకి.

 

"మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు" - రోమీయులకు 8:13

 

ఓడ లోపల ఉన్న నోవహు భూమి పైన ఉన్న నీరు ఇంకినదా లేదా తెలుసుకొనుటకు ఒక కాకిని బయటకు పంపించాడు. అది నీరు ఇంకే వరకు వెళ్తూ వస్తుండేది. దాని యొక్క జన్మ స్వభావము భూమి పైన ఉన్న చెడు పదార్థములను తినడం. నీటిపైన తేలియాడుతున్న శవములను తినిన తరువాత నివాసం ఉండుటకు మాత్రమే ఓడ లోనికి వచ్చేది. నోవహు దీనిని అర్థం చేసుకోలేకపోయాడు. కాకి వలన ఎటువంటి ప్రయోజనము లేదు. అది దాని సొంత కోరికను నెరవేర్చుకుంది కాని నోవహు యొక్క కోరికను నెరవేర్చలేదు. యేసు క్రీస్తుని అంగీకరించి తన జన్మ స్వభావమును విడిచి పెట్టని వారు ఈ కాకి వంటి వారే. వారికి దేవుని ఆశీర్వాదములు కావాలి లోకము కావాలి. దేవుడు వారిని ఈ లోకంలో ఉంచిన ప్రణాలికను తెలుసుకొనుటకు గాని నెరవేర్చుటకు గాని ప్రయాసపడరు. దేవునికి గాని ఇతర మనుష్యులకు గాని భయపడరు. దేవుని చిత్తాన్ని కాక వారి యొక్క సొంత కోరికలను నెరవేర్చు కొంటారు. కాని ఏలియాకు ఉదయము మరియు సాయంత్రం రొట్టె మరియు మాంసము తీసుకొచ్చిన కాకిని చూడండి. తనను మరియు తన జాతిని పోషించుకొనేటటువంటి దాని యొక్క జన్మ స్వభావము దేవుడు మార్చాడు. దాని యొక్క సొంత కోరికలను తొలగించారు. అందువలన అది ఏలీయా ప్రవక్తను పోషించి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవునికి మరియు మనుష్యునికి ఉపయోగపడింది. అదే విధంగా సొంత కోరికలన్నింటిని సిలువలో విడిచి పెట్టుటకు ఆత్మీయ వ్యక్తి పరిశుద్ధాత్ముని చేత సంపూర్ణంగా నడిపించబడతాడు. అతడు దేవుని మరియు చుట్టూ వున్న ప్రజలకు ఆశీర్వదకరముగా ఉంటాడు. 

 

ప్రియమైన వారలారా! మనం నోవహు ఓడలో ఉన్న కాకి వలె ఉన్నామా? లేక ఏలీయా కు సహాయము చేసిన కాకి వలె ఉన్నామా? అలోచిద్దాం. నోవహు ఓడలో కాకిమైతే మన యొక్క సొంత కోరికలు మరియు కోపములు, చిరాకు, గర్వము, అసూయ వంటివి తొలగించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనలను శుద్ధి చేయుటకు సమర్పించుకొందుము గాక! దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవునికి మరియు మనుష్యులకు ప్రయోజన కరమైన ఏలీయా కు సహాయము చేసిన కాకి వలె మారుదుము గాక! ఆమెన్.

- శ్రీమతి. గీతా రిచర్డ్

 

ప్రార్ధన అంశం:-

సత్యం అనే టీ.వి లో బయలు పడుతున్న కార్యక్రమాల ద్వారా అనేకులు క్రీస్తు కొరకు నడుచుకొనేవారిలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet