Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.06.2022
Share:

By Village Missionary Movement

Friday, 17-Jun-2022

దిన ధ్యానము(Telugu) 18.06.2022

 

అంశం:- నిదానించి చూసి నిశ్శబ్దంగా ఉండుము.

 

"నాకు కలుగజేసిన శ్రమవంటి శ్రమ మరి ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి" - విలాపవాక్యములు 1:12

 

యేసుక్రీస్తు సిలువలో చూపించిన ప్రేమకు సాటి వేరే ప్రేమ ఉన్నదా? భారమైన సిలువలో ఆయన రక్తమును , మేకులు కొట్టబడిన కాళ్ళు చేతులను, తలపై ముండ్ల కిరీటముతో ఆయన శ్రమలను చూసినప్పుడు మన జీవితంలో వచ్చిన ఏ కష్టమైన, దుఃఖమైన వాటికి సాటిగా నిలబడలేవు. రుబన్ అనే పాటల రచయిత వ్రాసిన ఆయనను నిదానించి చూడు అనే పాట సిలువలో యేసును వర్ణిస్తూ మన యొక్క శ్రమలలో ఆయన వైపే చూసి నిలకడగా ఉండాలి అని చెప్తూ ముగించబడినది. దూర దేశాల్లో పుట్టి సౌకర్యావంతమైన జీవితమును జీవించి విద్యను నేర్చుకొనిన రిచర్డ్ విలియం, డేవిడ్ లివింగ్ స్టన్, హట్సాన్ టైలర్, రాక్ ల్యాండ్, విలియం కేరీ ఇలా ఎంతో మంది మిషనరీలు తమ సొంత దేశమును మరియు సౌకర్య వంతమైన జీవితమును విడిచి పెట్టి వచ్చారు. అది మాత్రమే కాదు భయంకరమైన వేడిని అనుభవించి తమ భార్య పిల్లలను మరణమును అప్పగించి గృహ జీవితమును విడిచిపెట్టి రోజుకు నాలుగు గంటలు కూడా సరైన నిద్రలేక సరైన ఆహారం దొరకక వారి యొక్క చివరి శ్వాస వరకు సువార్తను ప్రకటించుటకే తమ ప్రాణాలను సమర్పించు కొన్నారు. 

 

పరిశుద్ద గ్రంధంలో యోసేపు గురించి చదివినప్పుడు తాను దాటి వచ్చిన మార్గంలో ఎంత నిశ్శబ్దంగా ఉన్నాడో మనము ఎరుగుదుము. సొంత సహోదరుల ద్వారా ద్వేషించబడి గుంటలో పడద్రోయబడి అమ్మబడి అన్యాయముగా నిందను మోపబడి అన్ని పరిస్థితుల్లో కూడా యోసేపు సహనం కలిగి ఉన్నాడు. పౌలు కూడా నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి యుండ నేర్చుకొని యున్నాను అని చెప్తున్నారు. కాని మనం చాలా సమయాల్లో మనకు వచ్చే శ్రమలలో నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని సనుగుకొంటున్నాం. మన జీవితంలో జరిగే క్రియలన్నింటిని దేవుడు ఎరిగి ఉన్నారు. ఆయన అనుమతి లేకుండా ఏ ఒక్కటి కూడా మనలను చేరదు. కాబట్టి దీనిని గమనించి బాధల మధ్యలో మనం నిశ్శబ్దంగా ఉండి ఆయన వైపు చూసినప్పుడు ఆయన నిశ్చయముగా అద్బుతములను చేస్తారు. ఆయన శ్రమలతో మన శ్రమలను పోల్చినప్పుడు మన శ్రమలు ఒక లెక్క కూడా కాదు అని తెలుసుకుంటాం. వీటన్నింటినీ సహించి తప్పించుకొని వాడబారని నిత్యమైన జీవకిరీటం పొందుకుంటాం అనడానికి సందేహమే లేదు.

- శ్రీమతి. జాస్మిన్ పాల్.

 

ప్రార్ధన అంశం:-

మిషనరీలకు మద్దతు ఇచ్చే భాగస్వాములను నూతనంగా దేవుడు ఇచ్చులాగున ప్రార్దిద్ధాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet