Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.06.2022
Share:

By Village Missionary Movement

Monday, 13-Jun-2022

దిన ధ్యానము(Telugu) 14.06.2022

 

అంశం:- మనము ప్రత్యేకించ బడిన వారము.

 

"నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది" – యోహాను 1:9

 

మిక్కిలి పేరు ప్రసిద్ధి పొందిన ఒక ధనవంతుడు జీవిస్తున్న ఊరిలో నీతిమంతుడును మరియు దేవుని యందు భక్తి గల వాడైన ఒకడు జీవిస్తూ వచ్చాడు. ధనవంతునికి ఇచ్చే మర్యాద వలె ఇతనికి కూడా మర్యాదయు, గౌరవమును ఇస్తూ వచ్చారు ఆ ఊరి ప్రజలు. చాలా ఊర్ల నుండి ప్రజలు అతని దగ్గర సలహాలు అడుగుటకు వచ్చేవారు. దానిని చూసిన ఆ ధనవంతునికి కోపమును మరియు అసూయయు కలిగాయి. ఇది ఎలా సాధ్యం నేను చాలా తలాంతులు గలవాడిని మరియు నేను చాలా ధనవంతుడనై అనేకులకు సహాయం చేస్తూ వస్తున్నాను. కాని అతని యొద్ద ఏ తలాంతులు లేవు యేసు దైవమును నమ్ముతున్న అతనికి ఎందుకు ఇంత ప్రసిద్ధి, మర్యాద అని ఆలోచించాడు. ఒకరోజు నేరుగా వెళ్ళి అతనిని చూసి అడగాలి అని అనుకున్నాడు ధనవంతుడు. ఒక రోజు సాయంత్రం ఆ వ్యక్తిని సందించుటకు వెళ్ళాడు. ఆ దైవ భక్తి కలిగిన వ్యక్తి ఆ ధనవంతుడను అక్కడ ఉండమని చెప్పి కొంచం చీకటి అయిన తరువాత కలిసాడు. అప్పుడు ఆ ధనవంతుడు ఇతరులు నన్ను గౌరవించుటకు మరియు నా పైన మర్యాద చూపించుటకు కారణం కలదు. మరి నా వలె ఎందుకు నిన్ను అందరూ గౌరవిస్తున్నారు అని అడిగాడు. ఆ వ్యక్తి తన ఇంటి వెనుక ఉన్న రోజా పువ్వుల తోటకు తీసుకు వెళ్ళాడు. అక్కడ చంద్రుడు ప్రకాశిస్తూన్నాడు. అతడు ఆ ధనవంతునితో దేవుడు సృజించిన ఆ రోజా పువ్వు ఎత్తైన స్థలములో ఉన్న ఆ చంద్రుని చూసి నేను అతని వలె ప్రకాశించ లేను అని అసూయ పడలేదు. అలానే ఆ చంద్రుడు కూడా నేను రోజా పువ్వు వలె అందముగా ఎర్రగా లేను అనుకొనుట లేదు. అలానే ప్రభువైన యేసుక్రీస్తు మనలను కూడా ప్రత్యేకంగా మరియు వేరువేరు తలాంతులు ఇచ్చి సృష్టించారు. మరి మనం ఎందుకు ఒకరికి ఒకరు చూసుకొంటు అసూయ మరియు బాధ పడుతున్నాం అని అడిగాడు. కయ్యినుకు హేబెలు మీద అసూయ కలిగింది. యోసేపు సహోదరులు యోసేపు మీద అసూయ కలిగింది. సౌలుకు దావీదుపై ఇలా చెప్పుకొంటూ వెళ్ళవచ్చు. మన యొద్ద లేనివి ఇతరుల యొద్ద వున్నప్పుడు ఇతరులు ఏదో ఒక విషయంలో అంగీకరింప బడినప్పుడు ఈ అసూయ మనలోనికి వచ్చేస్తుంది. మన యొద్ద లేనిదానిని చూసి ఇతరుల యొద్ద చూసి ఎందుకు అసూయ పడాలి. దేవుడు మనకు చాలా రకాల తలాంతులు ఇచ్చి మనలను విశేషమైన వారిలా సృష్టించారు అని ఆలోచన లేకపోతే మనలను మనమే తక్కువ అంచనా వేసుకుంటాం. ఇతరులను చూసి అసూయ పడతాం. స్నేహితుడా మత్సరము ఎముకలకు కుళ్ళు అది మన మస్సును పాడు చేస్తుంది. అందువలన ప్రార్ధనతో ఈ ఆలోచనను విడిచిపెట్టుటకు ప్రయాస పడదాం. నేను ప్రత్యేకించ బడిన వాడను దేవుడు నాకు ఇచ్చిన తలాంతులతో ఇతరులకు ప్రయోజన కరముగా ఉంటాను అనే ఆలోచన మనలో నిండును గాక! ఆమెన్.

- జ్ఞాన జ్యోతి సింసోన్.

 

ప్రార్ధనా అంశం:-

60 మిషనరీ ఇల్లులు కట్టుటకు భాగస్వాములను దేవుడు లేపులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet