By Village Missionary Movement
Friday, 10-Jun-2022దిన ధ్యానము(Telugu) 11.06.2022
అంశం:- నీ అంతు చూస్తా
"నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము" - మత్తయి 5:39
సమీపంలో వచ్చిన వార్తలను దానికి సంబంధించి పోస్టు చేసిన వీడియోలను చూసినప్పుడు యవ్వన సమాజం ఎటువైపు వెళ్తుంది మరియు వేటిని చూస్తూ వెళ్తుంది అనే భయం వేస్తోంది. కళాశాల విద్యార్థులు సహజ స్థలాలు, బస్టాండ్ అని కూడా చూడకుండా వారి స్థితిని మరచి స్వల్ప కార్యములకు గొడవ పడుతున్నారు. ఇతర విద్యార్థులు వారిని ఆపకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తున్నారు. ఇందులో ఇంకొక భయంకరమైన వీడియో ఏమిటి అంటే పాఠశాలలో చదువుకొంటున్న విద్యార్థులు సహజమైన స్థలాల్లో ఒకరిని ఒకరు కొట్టుకొంటున్నారు. జుట్టును పట్టుకొని మరి పౌరుషముగా గొడవ పడుతున్నారు. చిన్న చిన్న విషయాల్లో వారికి సర్దుకు పోయే మనస్సు వారికి లేదు. నువ్వా నేనా నీ అంతు చూస్తా చూడు అని పౌరుషముగా వుంటున్నారు.ఈ విధముగా యవ్వన తరం యొక్క స్థితి చాలా ప్రమాద కరముగా ఉన్నది.
పరిశుద్ద గ్రంధంలో ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక క్రైస్తవుని యొక్క స్వభావం ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. ఆయన భోద ఆశ్చర్య కరమైనది. అనుదిన జీవితమునకు చాలా అవసరమైనది. దుస్టుని ఎదిరింప కూడదు అని మత్తయి సువార్త 5: 39వ వచనంలో చెబుతున్నారు.
యోసేపుకు తన సొంత సహోదరుల వలన కీడు జరిగింది. గాని ఆయన వారిని ఎదురించ లేదు బదులుగా సహనం కలిగి ఉన్నాడు. నిన్ను కుడి చెంప మీద కొట్టు వానికి ఎడమ చెంప కూడా చూపించమని యేసు మనకు నేర్పించారు. దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఎవరైనా మనకు కీడు చెయ్యాలి అని అనుకున్నప్పుడు నిశ్శబ్దంగా సహనం కలిగి ఉండాలి అని.
దీనిని చదువుతున్న ప్రియ స్నేహిరులారా! మన చేతిలో అనేక బాధ్యతలు ఉన్నాయి అనే విషయాన్ని మర్చి పోవద్దు. మనకు కీడు అనేది ఏదో ఒక దేశ సరిహద్దు లోనుండో లేదా మనం ఊహించని వ్యక్తుల నుండో రాదు. మనతో ఉన్న వారు మనపైన ఆనుకొని ఉన్నవారు స్నేహితులు లేదా మన చుట్టుపక్కల ఉన్న వారి మూలముగా కీడు కలుగుతుంది. మనమే సహనముతో నిశ్శబ్దంగా ఉండాలి అని పరిశుద్ద గ్రంధం మూలముగా నేర్చుకోవాలి. మన తరువాత వచ్చే యవ్వన తరానికి మనమే నేర్పించాలి. నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు. అందుకే మనం పరిశుద్ద గ్రంధమును పరిశోధించి నేర్చుకొని విద్యార్థులకు నేర్పించాలి. నువ్వా నేనా నీ అంతు చూస్తా అనే మాటలకు అలవాట్లకు ముగింపు పెడదాం. యవ్వన తరాన్ని తగ్గించుకొని జీవించే వారిలా అభివృద్ధి చేద్దాం.
- బ్రదర్. టి.శంకర్ రాజ్ గారు.
ప్రార్ధన అంశం:-
అంత్యకాల ఉజ్జీవం కొరకు 120మంది మిషనరీలను ఏర్పరిచే ప్రణాళికలో చేసే ప్రయత్నాలు దేవుడు సఫల పరిచేలా ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250