Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.06.2022
Share:

By Village Missionary Movement

Thursday, 09-Jun-2022

దిన ధ్యానము(Telugu) 10.06.2022

 

అంశం:- కొండెము లాడుట

 

" కొండెగాడు మిత్రభేదము చేయును" - సామెతలు 16: 28

 

నేను ఉద్యోగం చేసే స్థలములో ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. అతడు మొదట కొంత మంది కోసం కొన్ని కొండెపు మాటలు నాతో చెప్పి ఇదంతా నీ మంచికే అని చెప్పేవాడు. రోజులు గడుస్తుండగా చాలా మందిని గూర్చి ఈ విధముగా చెప్పడం ప్రారంభించాడు. ఆ చేదు విత్తనం నాలో మొలవడం మొదలైయింది. అతను ఎవరిని గూర్చి కొండెపు మాటలను చెప్తున్నాడో వారిని నేను చూసినప్పుడు నాలో ఉన్న ఆ చేదు నన్ను వారి దగ్గరకు వెళ్ళకుండా చేసేది. కాని కొండెపు మాటలు చెప్పే ఆ వ్యక్తి మాత్రం వారితో సాధారణముగా మాట్లాడుతుండే వాడు. ఒక రోజు ఆదివారం ఆరాధన సమయంలో నా దగ్గర కొండెపు మాటలను చెప్పిన వ్యక్తి పాటలు పాడి ఆరాధనను నడిపిస్తున్నారు. ఆ ఆరాధన మూలముగా దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడారు. నువ్వెందుకు మనుష్యులను చూస్తున్నావ్ ఒక మనుష్యుడు చెప్పే చేదైన మాటల వలన నువ్వెందుకు చేదైన మనస్సుతో బ్రతుకుతున్నావ్ అని అడిగారు. వెంటనే మరుసటి రోజు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి మీ ఆరాధన చాలా అద్భుతంగా ఉంది నేను తాకబడ్డాను అని తనను ఉత్సాహ పరిచాను. నా యొద్ద కొండెపు మాటలను చెప్పే వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇకపై ఇలా నా దగ్గర మాట్లాడవద్దు అని చెప్పుటకు దేవుడు కృపను చూపించాడు. ఆ రోజు నుండి ఇతరులను గూర్చి మాట్లాడే స్థలములో నేను నిలవబడే వాడిని కాదు. నా చేదైన మనస్సు మారిపోయింది. అంతే కాక ఎవరైనా అక్కడ లేని ఇతర వ్యక్తి కోసం మీ దగ్గర కొండెపు మాటలను చెప్పినట్లయితే సరదాగా మాటలు మార్చి ఆ వ్యక్తిలో ఉన్న పాజిటివ్ విషయాలు మాట్లాడి అలా ఆ సంభాషనను ముగించాలి. కొండెపు మాటలను చెప్పుటకు వచ్చిన వారు కూడా చెప్పడం మానేస్తారు. 

 

లేవియకాండం 19వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణ హానిచేయ చూడకూడదు, నేను యెహోవాను అని దేవుడు సెలవిచ్చాడు. 

 

ప్రియమైన వారలారా! అనేక సమయాల్లో మనం మనకు తెలియకుండానే ఇతరులను గూర్చిన విషయాలు మాట్లాడుతుంటాము. కాని పరిశుద్ద గ్రంధం అతి స్పష్టంగా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతోంది. స్పానిష్ భాషలో ఒక సామెత ఉంది హూ ఎవర్ గాసిప్స్ టు యూ విల్ గాసిప్స్ అబౌట్ యూ అనగా నీ దగ్గర ఇతరులను గూర్చి కొండెపు మాటలను చెప్పేవారు ఒక రోజు నిన్ను గూర్చి ఇతరుల దగ్గర కొండెపు మాటలు చెప్తారు అని అర్థం. అందువలన కొండెపు మాటలాడుటను మరియు కొండెపు మాటలు వినుటను నివారిద్దాం చేదైన హృదయం లేకుండా మంచి హృదములో దేవుని ప్రేమ నింపబడిన వారమై జీవిద్దాం.

- బ్రదర్. టి. రాజన్ గారు

 

ప్రార్ధనా అంశం:-

ఒక గ్రామానికి 2000 రూపాయలు ఇచ్చి సహకరించే గ్రామ భాగస్వాములు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet