Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.06.2022
Share:

By Village Missionary Movement

Thursday, 09-Jun-2022

దిన ధ్యానము(Telugu) 09.06.2022

 

అంశం:- బ్రేక్

 

"యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను" - యోబు 42:12

 

ఒకసారి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఎందుకు వాహనములకు బ్రేకులు అమర్చారు అని అడిగారు. అతనికి రకరకాల జవాబులు వినబడ్డాయి. ఆపుటకు, వేగమును తగ్గించుటకు, సంఘర్షణను తగ్గించుటకు, నెమ్మదిగా వెళ్లుటకు, సరైన వేగములో వెళ్లుటకు అని విద్యార్థుల నుండి రకరకాల జవాబులు వచ్చాయి. ఒకే ఒక విద్యార్థి మాత్రం వేగముగా వెళ్లుట కొరకు బ్రేకు లు అమర్చారు అని చెప్పాడు. దానిని విన్న విద్యార్థులు అందరూ నవ్వడం మొదలుపెట్టారు. అవును బ్రేక్ లేకపోతే వేగంగా డ్రైవ్ చెయ్యలేరు. బ్రేక్ మాత్రమే మనం అనుకునే స్థలంలో ఆగేలా చేస్తుంది అనే దైర్యంతో వెళతాం అని ఉపాధ్యాయుడు చెప్పాడు. నిదానంగా బ్రేక్ పట్టుకొని దాటి వెళ్లినట్లయితే మనం కోరుకొనే లక్ష్యన్ని సులువుగా చేరుకోవచ్చు. 

 

సడన్ బ్రేక్ వేసి ఆగిపోయిన ఒక వ్యక్తి యొక్క జీవితమును గూర్చి పరిశుద్ద గ్రంధంలో మనం చదువుతున్నాం. అతనే యోబు. అతనికి పది మంది పిల్లలు ఉండేవారు మరియు విస్తారమైన పశువులు, చాలా మంది పనివారు కూడా ఉండేవారు. తనకు ఉన్న సంపద సమస్తమును ఒకే రోజులో కోల్పోయాడు యోబు. వీటన్నింటి విషయములో యోబు పాపము చెయ్యలేదు. దేవునికి కూడా లోటుపాట్లు చెప్పలేదు. తన జీవితంలో దేవుడు వేసిన బ్రేక్ తప్పదు అని నమ్మాడు. తరువాత యోబు కోల్పోయిన అంతయు రెండతలు పొందుకున్నాడు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన దేవుని పిల్లలారా! మన జీవితంలో నష్టాలు, అడ్డంకులు, బ్రేకులు వచ్చినప్పుడు అవి మన జీవిత వేగాన్ని తగ్గించడానికి ఆనుకొని మన హృదయంలో కృంగిపోతున్నాం. మన ఆశలను త్రొక్కివేసినట్లు అనుకొంటున్నాం. మన జీవితంలో వచ్చిన బ్రేకులు వేగమును తగ్గించుటకు కాదు వేగముగా వెళ్లుటకే. మన జీవితంలో అకస్మాత్తుగా వేసినట్లు అనిపించే బ్రేకులు దేవుని కాళ్ళ క్రింద లేదా ఆయన చేతుల్లో ఉంటాయి. ప్రభుని చేతులు దాటి మన జీవితంలో ఏది జరగదు. అందువలన నిదానంగా ఉండే యోబు వలె రెండతలు ఆశీర్వదములు పొందుకుందాం.

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు

 

ప్రార్ధన అంశం:-

ప్రతి గ్రామంలో గిద్యోను వంటి యవ్వనస్తుడు ప్రార్ధనా సమూహ నాయకుడిగా లేచు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet