By Village Missionary Movement
Tuesday, 07-Jun-2022దిన ధ్యానము(Telugu) 07.06.2022
అంశం:- రుద్దటం వలన సువాసన.
"నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును" - యోబు 23:10
టీకాల పితామహుడు అని పిలువబడే లూయిస్ పాస్కల్ కు 5గురు పిల్లలు. ఇందులో ముగ్గురు టైఫయిడ్ రావడం వలన ఒకరి తరువాత ఒకరు చనిపోయారు. వెంటనే అతను ఇటువంటి వ్యాధులకు కారణం ఏమిటి అని ఆలోచించాడు. చాలా ప్రయత్నాలు చేసి సూక్ష్మ జీవులే ఈ వ్యాధికి కారణం అని కనుగొన్నాడు. ఇంకా దీనిని నివారించుటకు ఏం చెయ్యాలి అని చాలా పరిశోధన చేసి టీకా ను కనుగొన్నాడు. టైఫాయిడ్ కు మాత్రమే కాదు పచ్చకమెర్లు, రాబిన్ వంటి వ్యాధులకు టీకా ను కనుగొన్నాడు. తన జీవితంలో ఏర్పడే విపత్తులే నూతనమైన వాటిని కనుగొనుటకు దారి తీశాయి. గులాబీ రెక్కలు ముండ్లు పైన పడినప్పుడే సువాసన అధికముగా వస్తుంది. చందనం బాగా రుద్దినప్పుడే సువాసన అధికముగా వస్తుంది. అదేవిధంగా మనుష్యులమైన మనము శోధింప బడినప్పుడే మనలో అణిగి అడుగు బాగమున ఉన్న లక్షణాలు బయటకు తేబడతాయి. శోధింప బడినప్పుడు చాలా కష్టముగా ఉన్నప్పటికీ ఆ సమయంలోనే మనలో ఉన్న అసాధారణమైన స్వభావములు బయట పడతాయి. మన యొక్క పూర్తి బలం కూడా అప్పుడే మనం గ్రహించ గలం. మనలో అణిచివేయబడిన తలాంతులు శోధించ బడినప్పుడు బయలు పడతాయి. అందువలన యోబు ధైర్యంగా ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అని చెప్పాడు. మోషే అరణ్యములో శోధింప బడినప్పుడే గొప్ప నాయకునిగా మార్చబడ్డాడు. యోసేపు బానిసగా చెరసాలలో వేయబడినప్పుడే కలకు అర్థం చెప్పే తలాంతు బయట పడింది. యోబు శోధించ బడిన తరువాతే అన్ని పరిస్థితుల్లో దేవున్ని విడువని వాడు మరియు దేవునికి భయపడు వాడు అని తెలుసుకొనగలిగాం.
ప్రియమైన వారలారా! నేను మాత్రమే శోధింప బడుతున్నాను అని శోధనను చూసి కృంగి పోవద్దు. లూయిస్ పాస్కల్ వలె ధైర్యముగా శోధనను జయించి నప్పుడు అన్నింటినీ సాదించగలం. మనలో ఉన్న తలాంతులను మరియు స్వభావములను ఎరుగుటకే శోధనలు. సాధించాలి అని అందరికి అశే అందుకు శోధనను ఎదుర్కొనుట అవసరం. శోధనను ఎదుర్కొంటే మీరు కూడా సాదించే వారిలా మారతారు. శోధన లేకుండా సాధన లేదు, వేదన లేకుండా జయము లేదు.
- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు.
ప్రార్ధన అంశం:-
ఉజ్జీవ కూటములలో పాల్గొంటున్న వ్యక్తులు ఉజ్జీవముతో క్రియ జరిగించు లాగున మరియు వీరి ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగించు లాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250