Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.06.2022
Share:

By Village Missionary Movement

Monday, 06-Jun-2022

దిన ధ్యానము(Telugu) 06.06.2022

 

అంశం:- మీరు అభిగయేలు వంటి వారా?

 

"ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంత రింద్రియములందు కోపము సుఖనివాసము చేయును" - ప్రసంగి 7:9

 

కేరళలో గల కొలికోడ్ అనే ప్రాంతంలో భార్య భర్తలు మరియు ఇద్దరు ఆడపిల్లలు ఉండేవారు. ఆ ఇంట్లో భర్త త్రాగుబోతు మరియు కోపిష్టి కూడా. ఇంట్లో తన భార్య ఏం చేసినను ఆయన కోపపడుతు ఉంటాడు. ఒక రోజు బాగా త్రాగేసి ఇంటికి వచ్చాడు. ఇంట్లో దాచిపెట్టి ఉన్న ఆత్మీయ యాత్ర అనే క్రైస్తవ రేడియో కార్యక్రమాన్ని విన్న వెంటనే కోపంతో ఆ రేడియోను పగులగొట్టేసాడు. ఇతనికి మనస్సులో కొంచం ఆత్రుత ఉండటం వలన ఆ మరుసటి రోజు ఒక రేడియోను కొని ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినుట ప్రారంభించాడు. నెమ్మదిగా యేసుని విశ్వసించి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఎంతటి ఆశ్చర్యం. యేసుక్రీస్తు తన హృదయంలోనికి వచ్చాక తన త్రాగుడును పూర్తిగా విడిచిపెట్టి దేవుని బిడ్డగా ఇప్పుడు జీవిస్తున్నాడు.

 

పరిశుద్ద గ్రంధంలో 1 సమూయేలు గ్రంధం 25వ అధ్యాయం 3వ వచనంలో నాబాలు భార్య అయిన అభీగయేలు సుబుద్ది గల స్త్రీ. కాని నాబాలు మోటుతనము గలవాడు అని చదువుతున్నాం. దావీదు యొద్ద నుండి సంరక్షణను మేలులు పొందుకున్న నాబాలు మేలుకు ప్రతిగా కీడును చేసాడు. దావీదు ఎవడు అని నాబాలు అడిగిన దానిని విన్న దావీదు 400 మందితో బయలుదేరాడు. ఆ సంగతిని తన పనివారి ద్వారా విని తన యొక్క వినయం వలన తన యొక్క మర్యాద పూర్వకమైన మాటల వలన దావీదు చేయి రక్తం చిందించకుండా తన యొక్క కోపమును తగ్గించింది. 

 

ప్రియమైన యవ్వనులారా! కోపం ఎంత భయంకరమైనదో మీకు తెలుసు. త్రాగి వచ్చిన తన భర్తను తన భార్య ఎదిరించి ఉంటే ఆ కుటుంబం పాడైపోయి ఉండేది. ఆమె ఓర్పు, దయ, సహనంతో ఉండి తన భర్త రక్షణకు కారణం అయ్యింది. అభీగయేలు కూడ దావీదు కోపం నాబాలు మీద రగులుకొన్నది అని విన్న వెంటనే ఈయనకు ఇలానే జరగాలి అని పట్టించుకోకుండా ఉండి ఉంటే ఆ అభీగయేలు కూడా ప్రాణాలతో వుంటుందా అనేదే ప్రశ్నార్ధకమే. ఆమె తెలివిగా మాట్లాడి చురుకుగా పనిని జరిగించిన అభీగయేలు దావీదు కోపమును చల్లార్చడం మాత్రమే కాదు అతని ద్వారా ఆశీర్వదించబడింది. దావీదు కోపమును చల్లార్చిన సుబుద్దిగల అభీగయేలు వలె ఉండుటకు ప్రయాస పడదాం.

- శ్రీమతి. హెప్సి మణువేల్ జయరాజ్ గారు.

 

ప్రార్ధన అంశం:-

విలేజ్ మిషనరీ మూమెంట్ తరుపున జరుగుతున్న వి.బి.ఎస్ మూలముగా గ్రామాల్లో ఉన్న చిన్నపిల్లలు దేవునిలో నిలకడగా ఉండు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet