Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.06.2022
Share:

By Village Missionary Movement

Thursday, 02-Jun-2022

దిన ధ్యానము(Telugu) 02.06.2022

 

అంశం:- మన పైన ఉన్న బాధ్యత.

 

"మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి" - మార్కు 16:15

 

నేను ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన వాడిని. కాని దేవుని కృపవలన పాలిటెక్నీక్ పూర్తి చేశాను. కొన్ని నెలల పాటు సరైన ఉద్యోగం లేనప్పటికి దేవుడు తన కృప ద్వారా మంచి ఉద్యోగం ఇచ్చారు. ఆశ్చర్య కరముగా నేను ప్రభువును అంగీకరించారు. ఆ తరువాత క్రమముగా ఆదివారం ఆరాధనకు వెళ్లి ఒక సాధారణ క్రైస్తవునిగా జీవించాను. ఒక రోజు సాయంత్రం ఒక సహోదరుడు చిన్న పిల్లలకు సుండేస్కూల్ క్లాస్ చెబుతున్నాడు. అతడు 5రోజులు ఉద్యోగం చేసి మిగిలిన 2రోజులు పరిచర్య చేస్తాను అని అతడు నాతో చెప్పాడు. అతనికి సరైన వాహన వసతి లేదు. సుమారుగా 10కిలోమీటర్లు దూరం వెళ్లి సేవ చేస్తూ ఉంటారు. అతడు అన్ని కిలోమీటర్లు సైకిల్ పైన వెళ్లి సేవచెయ్యడం నాకు ఆశ్చర్యంగా మరియు నాకు బాధగా ఉండేది. అతడు సేవచేయుటకు నన్ను కూడా పిలుస్తూవుండేవారు. ఒకరోజు అతని పిలుపును భరించలేక సరే అని చెప్పాను. మిమ్మల్ని నా బండిపైన తీసుకు వెళ్ళి గ్రామంలో దించుతాను కాని సేవ చెయ్యమని నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పాను. ఒక వారం గడిచింది. రెండవ వారం మాత్రం కంఠత వాక్యం పిల్లలకు నేర్పించు అని చెప్పారు. కంఠత వాక్యమే కదా అని చెప్పి నేర్పించాను. ఆ తరువాత పాట నేర్పించమని చెప్పారు. అప్పుడు కూడా పాటే కదా అని అనుకొన్నాను. ఆ తరువాత కధ చెప్పామన్నారు. సరే కథే కదా అని చెప్పేసాను. ఒక రోజు కూర్చొని ఆలోచించి నప్పుడు అతడు నాకు తెలియ కుండా నాతోనే సేవ చేయిస్తున్నాడు అని గ్రహించాను. ఇది సరైనది కాదు అనుకొని ఇకపై నేను రాను అని చెప్పేస్తాను అని అనుకున్నాను. కాని దేవుడు అతనితో వెళ్ళు అతడు చెప్పినది చెయ్యు అని నాకు ఆజ్ఞపించారు. ఈ విధముగా నా పరిచర్య మొదలైయింది. ఈనాడు అనేక గ్రామాల్లో చిన్న పిల్లల మధ్యలో నేను సేవ చేస్తువున్నాను. 

 

ప్రియమైన వారలారా! మనము కూడా అనేక సమయాల్లో సేవ మనకొరకైనది కాదు అని అనుకుంటాం. కాని పరిశుద్ద గ్రంధం చెబుతోంది సువార్తను ప్రకటింప వలసిన భారం మన మీద మోపబడి ఉన్నది అని. యేసుక్రీస్తు కూడా చివరి దినాల్లో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెబుతున్నారు. అలా అయితే సేవ అనేది మన అందరి బాధ్యత. భారం మాత్రమే కాదు దేవుని ఆజ్ఞ కూడా. అందువలన చేయగలిగి నంత సేవను చేద్దాం దేవుని ఆశీర్వాదమును పొందుకుందాం.

- బ్రదర్. మారియప్పన్

 

ప్రార్థన అంశం:-

మన మిషనరీలందరిని దేవుడు మహిమ కరముగా వాడుకొని దేవుడు వాళ్లపైన ఉంచిన ప్రణాళికలు ఆటంకం లేకుండా నెరవేరాలని ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet