Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.06.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 01-Jun-2022

దిన ధ్యానము(Telugu) 01.06.2022

 

అంశం:- ఆత్మీయ ఖడ్గం.

 

"మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు" - హెబ్రీయులకు 5:13

 

భారతదేశం స్వాతంత్ర్యం పొందుకున్న తరువాత మన పొరుగు దేశం అయిన పాకిస్తాన్ ప్రజలతో కొన్ని యుద్ధాలు చెయ్యాల్సి వచ్చింది. అయితే ప్రతి యుద్ధంలో మన భారతదేశమే జయించింది. పాకిస్తాన్ సైనికులు తమ సైన్య బలహీనత ఏమిటి అని ఆలోచించి చూసారు. వారి యొద్ద అధునాతన ఆయుధాలు ఉన్నప్పటికీ వాటిని సరైన పద్దతిలో వాడలేకపోయారు అంటే చాలా తక్కువ శిక్షణ పొందుకొనుట వలన యుద్ధంలో సులభంగా ఓడిపోయారు అని తెలుసుకొనగలిగారు. అధునాతన ఆయుధాలు ఉన్నప్పటికీ వాటి మీద జ్ఞానం లేకపోవడం వలన వెనుదిరిగవలసి వచ్చింది. దీనిద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం కూడా ఉంది. ఆత్మీయ జీవితంలో మనకు విరోధముగా యుద్ధం కలదు. అందులో సైతానును ఎదిరించి యుద్ధం చెయ్యాల్సి ఉంది. శత్రువు యొద్ద బలహీనమైన ఆయుధాలు ఉన్నాయి.కాని వాటిద్వారా అనేక మందిని పడగొడుతున్నారు. అదే సమయంలో దేవుని బిడ్డల యొద్ద బలమైన ఆయుధాలు ఉన్నాయి. అపోస్తులుడైన పౌలు ఎఫెస్సి పత్రిక 6వ అధ్యాయంలో మనకు ఏయే ఆయుధాలు ఉన్నాయో చెబుతున్నారు. ఇలా సమస్త ఆయుధాలు ధరించుకొని క్రీస్తులో రోషం కలిగిన వాడిలా ఉండకుండా చిన్న శిశువుల వలె ఉండుట చాలా బాధాకరమైన విషయం. అందులో ప్రాముఖ్యంగా వాక్యం అనే ఆత్మీయ ఖడ్గంను ఉపయోగించే అలవాటు లేనివారు అతి సులభముగా సాతానుకు ఆహారం అయిపోతారు. 

 

యేసుక్రీస్తును శోధించుటకు సైతాను తీసుకువచ్చిన 3 శోధనలను వాక్యం అనే ఖడ్గం ద్వారా జయించారు. పరిశుద్ద గ్రంధంలో ఇలా వ్రాయబడి ఉన్నది కదా అని మరల మరల ఎత్తి చూపించి చెబుతున్నారు యేసు. దీనిని చదువుతున్న నా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా మీలో వాక్యం నిండి ఉండాలి అని దేవుడు ఆశ పడుతున్నారు. మీకు ఎదురుగా వచ్చే అన్ని సమస్యలను, శత్రువుల సంతతిని మరియు మాయ క్రియలు జయించుటకు వాక్యం తప్ప వేరే ఆయుధం లేదు. అందువలన వాక్యాన్ని ధ్యానించండి వాక్యం ద్వారా నింపబడండి అప్పుడు మీరు జయించే వారిలా మారతారు. ఆమెన్.

- బ్రదర్. పి. జాకబ్ శంకర్ గారు

 

ప్రార్ధన అంశం:

ఈ నెలంతా జరిగే పరిచర్యలలో దేవుడు తన మహిమను బయలుపరిచేలా ప్రార్ధిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet