Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.05.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 31-May-2022

దిన ధ్యానము(Telugu) 31.05.2022

 

అంశం:- క్రయ ధనము చెల్లించే ప్రేమ.

 

"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" - యోహాను 3: 16

 

చాలా సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశంలో ఉన్న ఒక పెద్ద మందిరంలో గొప్ప ధనవంతుడు ఒకడు ఒంటరిగా బ్రతుకుతూ వచ్చాడు. చాలా దర్జాగా బ్రతక వలసిన అతను ఒక మధ్యతరగతి ప్రజలు భుజించి ఆహారమునే భుజించేవాడు. మధ్య తరగతి ప్రజలు ధరించే దుస్తులనే ధరించేవాడు. తన ఊరి ప్రజలు అందరు తన పేద జీవితమును చూసి అతనిని పరిహాసం చేసేవారు. ఇంత ధనాన్ని ఎవరికోసం దాచిపెడుతున్నాడు అని హేళన చేసేవారు. కాలం గడిచింది. ఒక రోజు అతను చనిపోయాడు. అతను వ్రాసి ఉంచిన కాగితము ఆ ఊరి ప్రజల చేతికి దొరికింది. వారు దానిని చూసి వణికిపోయారు. తన డబ్బు ధనం అంతటిని నీరు దొరకక బాధపడే ఆ ఊరి ప్రజలకు ఉచితంగా నీటి సరఫరా చేయుటకు ఉపయోగించమని వ్రాసి ఉంది. 

 

యేసుక్రీస్తు కూడా తన పరలోకపు మహిమను విడిచిపెట్టి ఒక పేద వానిగా ఈ లోకానికి వచ్చారు. మనం ఐశ్వర్యవంతులము అవ్వాలని ఆయన దరిద్రుడయ్యారు. అయితే ఆయన మన నుండి ఆశించే విషయాలు రెండే 1. నీ పూర్ణ హృదయము తోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెను అనునదే అని అన్నారు. మనం మన యొక్క సమస్తమును ఆయనకు ఒక బాధ్యత కలిగిన వారిలా ఇవ్వకుండా ప్రేమించి సమర్పించే వారిలా ఇవ్వాలి. అబ్రాహాము ఆయనను ప్రేమిస్తున్నాడా లేదా అని తెలుసుకొనుటకే అదికాండం 22:2 వ వచనంలో ఇస్సాకును బలిగా అర్పించమని అడిగారు. ఇందులో ఇస్సాకును బలిగా తీసుకోవాలి అని ఆయన కోరిక కాదు గాని ఇస్సాకు కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని తెలుసుకొనుటకే దేవుడు ఆశ పడ్డారు. 2. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అనునదియే. త్రాసులో గల రెండు పళ్ళెముల వలె సమానముగా ఉండాలి. ఇందు కొరకు ప్రభువైన యేసు మంచి సమరయుని ఉపమానం చెప్పారు. ప్రేమ అని చెప్పడం అంటే స్వయముగా ముందుకు వచ్చి తన సంతోషాన్ని ఇతరుల కొరకు వ్యచ్చించాలి. మనం చుట్టు ప్రక్కల వారితో ప్రేమగా ఉండాలి. అలా ఉంటే మనం దేవున్ని ప్రేమించు వారామౌతాము. మంచి సమరయుడు తన ద్రాక్ష రసమును, నూనెను, వాహనమును, రెండు దేనారములను ఖర్చు చేసాడు.

 

ప్రియమైన వారలారా! మన యొక్క ప్రేమ క్రయ ధనము చెల్లించేదిగా ఉన్నదా? అనే విషయాన్ని ఆలోచించి చూద్దాం. క్రయధనము చెల్లించ కుండా ప్రేమించలేము. క్రయ ధనము చెల్లించని ప్రేమ ఉపయోగము కాదు. క్రయ ధనము చెల్లించే ప్రేమ మనకు ఇతరులకు కూడా ఉపయోగకరముగా ఉంటుంది. హల్లెలయా.

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు.

 

ప్రార్ధన అంశం:-

ఆంధ్ర ప్రదేశ్ మరియు ఒడిషా రాష్ట్రాలలో కట్టబడుతున్న ఆలయములు త్వరలో కట్టబడులాగున , వాటికి కావలసిన అవసరతలు సందింపబడేలా ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al